బంగ్లాదేశ్‌ గెలుపున్యూజిలాండ్‌తో తొలిటెస్ట్‌

bangladesh-vs-new-zealand-1st-test

 ఢాకా: తొలిటెస్ట్‌లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ జట్టు ఘన విజయం సాధించింది. రెండు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలిటెస్ట్‌లో బంగ్లాదేశ్‌ జట్టు 150పరుగుల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 332పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ 181పరుగులకే ఆలౌటైంది. తైజుల్‌ ఇస్లామ్‌(6/75) బంగ్లాదేశ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో బంగ్లాదేశ్‌ జట్టు తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్‌పై ఒక టెస్ట్‌లో గెలిచినట్లైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 7వికెట్ల నష్టానికి 113పరుగులతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ జట్టు 181పరుగులకు కుప్పకూలింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ తైజు ల్‌ ఇస్లామ్‌కు లభించనగా.. రెండో, చివరి టెస్ట్‌ బుధవారం నుంచి మీర్‌పుర్‌ వేదికగా జరగనుంది.

స్కోర్‌బోర్డు..

బంగ్లాదేశ్‌ : 310,

338న్యూజిలాండ్‌ : 317, 181

➡️