చివర్లో చేతులెత్తేసిన బ్యాటర్లు – భారత్‌ 174/9

Dec 2,2023 08:37 #Sports

రాయ్ పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టి20లో చివర్లో భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆసీస్‌ముందు భారీ లక్ష్యాన్ని ఉండంలో టీమిండియా విఫలమైంది. దీంతో టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది. ఓ దశలో 4వికెట్ల నష్టానికి 167పరుగులతో పటిష్టంగా ఉన్న టీమిండియా.. 7పరుగుల వ్యత్యాసంలో ఐదు వికెట్లు కోల్పోయి నిరాశపరిచింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకోగా… టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లు సమయోచితంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు నమోదు చేయగలిగింది. హార్డ్‌ హిట్టర్‌ రింకూ సింగ్‌ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ 19 బంతుల్లోనే 1 ఫోర్‌, 3 సిక్సులతో 35 పరుగులు సాధించాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ 37, రుతురాజ్‌ గైక్వాడ్‌ 32 పరుగులు చేశారు. శ్రేయాస్‌ అయ్యర్‌ (8), సూర్యకుమార్‌ యాదవ్‌ (1) విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో బెన్‌ డ్వార్షూయిస్‌ 3, జాసన్‌ బెహ్రెండార్ఫ్‌ 2, తన్వీర్‌ సంఘా 2, ఆరోన్‌ హార్డీ 1 వికెట్‌ తీశారు.స్కోర్‌బోర్డు.. ఇండియా ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)డెర్మాట్‌ (బి)హార్డి 37, గైక్వాడ్‌ (సి)డ్వార్షూస్‌ (బి)సంఘా 32, శ్రేయస్‌ (సి)క్రిస్‌ గ్రీన్‌ (బి)సాంఘా 8, సూర్యకుమార్‌ (సి)వేడ్‌ (బి)డ్వార్షూస్‌ 1, రింకు సింగ్‌ (ఎల్‌బి)బెహ్రెన్‌డార్ష్‌స్‌ 46, జితేశ్‌ శర్మ (సి)హెడ్‌ (బి)డ్వార్షుస్‌ 35, అక్షర్‌ పటేల్‌ (సి)సంఘా (బి)డ్వార్షుస్‌ 0, దీపక్‌ చాహర్‌ (సి)క్రిస్‌ గ్రీన్‌ (బి)బెహ్రెన్‌డార్ఫ్‌ 0, రవి బిష్ణోరు (రనౌట్‌) ఫిలిప్స్‌/హెడ్‌ 4, ఆవేశ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 1, అదనం 10. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 174పరుగులు. వికెట్ల పతనం: 1/50, 2/62, 3/63, 4/111, 5/167, 6/168, 7/168, 8/169, 9/174 బౌలింగ్‌: హార్డి 3-1-20-1, బెహ్రెన్‌డార్ఫ్‌ 4-0-32-2, డ్వార్షుస్‌ 4-0-40-3, క్రిస్‌ గ్రీన్‌ 4-0-36-0, సాంఘ్వా 4-0-30-2, షార్ట్‌ 1-0-10-0.

➡️