టెస్ట్‌లకు బవుమా..మార్‌క్రమ్‌కు వన్డే, టి20 పగ్గాలు..

Dec 4,2023 21:07 #Sports
  • భారత్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్లను ప్రకటించిన బోర్డు

జొహాన్స్‌బర్గ్‌: భారత్‌తో స్వదేశంలో తలపడే దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు సోమవారం ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన బవుమాకు వైట్‌బాల్‌ క్రికెట్‌కు దూరం కాగా.. టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక భారత్‌తో వన్డే, టి20 సిరీస్‌లలో తలపడే దక్షిణాఫ్రికా జట్టుకు మార్క్‌క్రమ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పరిమిత ఓవర్ల సారథిగా చాలాకాలంగా కొనసాగుతున్న టెంబా బవుమాను సఫారీ సెలక్టర్లు పక్కనబెట్టారు. టీ20 ప్రపంచ కప్‌ కొద్ది నెలల్లో జరగనున్న దృష్ట్యా ఈ ఫార్మాట్‌కు సంబంధించిన ప్లేయర్లనే ఎక్కువగా ఎంపిక చేసింది. కానీ ఆ జట్టు యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ను మాత్రం పక్కనబెట్టడం గమనార్హం. బవుమాను పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతల నుంచే గాక ఈ రెండు సిరీస్‌ల నుంచి కూడా బోర్డు తప్పించింది. బవుమాతో పాటు రబాడాను కూడా పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

ముగ్గురు కెప్టెన్లతో సఫారీ టూర్‌కు టీమిండియా..

దక్షిణాఫ్రికాలో పర్యటించే భారతజట్టుకు ముగ్గురు కెప్టెన్లను బిసిసిఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మ టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. టి20లకు సూర్యకుమార్‌ యాదవ్‌, వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ను సారథిగా నియమించింది. కొంతకాలంగా టీ20లకు కెప్టెన్‌గా ఉంటోన్న హార్దిక్‌ పాండ్య గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో సూర్యకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. దక్షిణాఫ్రికాతో వన్డే, టి20 సిరీస్‌లకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి దూరంగా ఉండటంతో కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురిని కెప్టెన్‌గా నియమించడంపై భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మండిపడ్డాడు. త్వరలో టి20 ప్రపంచకప్‌ జరగనున్న దృష్ట్యా ఇదే విధానమంటూ బిసిసిఐని దుయ్యబట్టాడు.

దక్షిణాఫ్రికా జట్లు..

టి20లకు: మార్క్‌క్రమ్‌(కెప్టెన్‌), బార్ట్‌మన్‌, మాథ్యూ బ్రీట్జ్‌, బర్గర్‌, కోయెట్జ్‌, అండిల్‌ పెహ్లుక్వాయో, షాంసీ, స్టబ్స్‌. డొనొవన్‌ ఫెరీరా, హెండ్రిక్స్‌, క్లాసెన్‌, కేశవ్‌ మహారాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, తొలి రెండు టి20లకు: లిజాడ్‌ విలియమ్స్‌, మార్కో జాన్సెన్‌, లుంగి ఎంగిడి.

వన్డేలకు: మార్క్‌రమ్‌(కెప్టెన్‌), బార్ట్‌మన్‌, బర్గర్‌, టోని-డి-జోర్జి, హెండ్రిక్స్‌, క్లాసెన్‌, కేశవ్‌ మహారాజ్‌, ఎంపగ్వానా, డేవిడ్‌ మిల్లర్‌, మల్డర్‌, పెహ్లుక్వాయో, షాంసీ, వాన్‌డెర్‌-డసెన్‌, వెర్రెయెన్‌, విలియమ్స్‌.

టెస్టులకు: బవుమా(కెప్టెన్‌), బెడింగ్హమ్‌, బర్గర్‌, కొయెట్జ్‌, టోని-డి-జోర్జి, ఎల్గర్‌, జాన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, మార్‌క్రమ్‌, మల్డర్‌, ఎంగిడి, పీటర్సన్‌, రబాడా, స్టబ్స్‌, వెర్రెయెన్‌.

టి20సిరీస్‌..

10(ఆది) : తొలి టి20(డర్బన్‌)

12(మంగళ) : రెండో టి20(సెయింట్‌జార్జెస్‌)

14(గురు) : మూడో టి20(జొహన్నెస్‌బర్గ్‌)

వన్డే సిరీస్‌..

17(ఆది) : తొలి వన్డే(జొహన్నెస్‌బర్గ్‌)

19(మంగళ) : రెండో వన్డే(సెయింట్‌జార్జెస్‌)

21(గురు) : మూడో వన్డే(పార్ల్‌)

టెస్ట్‌ సిరీస్‌

26-30 : తొలిటెస్ట్‌(సెంచూరియన్‌)

జనవరి 3-7 : రెండోటెస్ట్‌(కేప్‌టౌన్‌)

➡️