క్రికెట్‌ మ్యాచ్‌లో ఘర్షణ.. బాలుడి మృతి

Dec 24,2023 19:16 #Sports

నెల్లూరు: క్రికెట్‌ ఆడుతుండగా తలెత్తిన వివాదం ఓ బాలుడి మృతికి కారణమైంది. నెల్లూరులోని జాకీర్‌ హుస్సేన్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫరీద్‌ (14)ను మరో బాలుడు గొంతు, గుండెపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మఅతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

➡️