ముగిసిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్‌

Dec 16,2023 22:02 #Sports

– బాలురు విభాగంలో కడప, బాలికల విభాగంలో విశాఖ జట్లు విజయం

ప్రజాశక్తి – నక్కపల్లి (అనకాపల్లి)స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌ – 19 బాల, బాలికల 67వ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గన్నారు. బాలురు విభాగంలో ప్రథమ స్థానంలో కడప, బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో విశాఖపట్నం జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో విశాఖపట్నం, తృతీయ స్థానంలో చిత్తూరు, బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో చిత్తూరు, తృతీయ స్థానంలో తూర్పుగోదావరి జట్లు నిలిచాయి. రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, జెడ్‌పిటిసి సభ్యులు గోసల కాసులమ్మ, వైస్‌ ఎంపిపి సభ్యులు వీసం నానాజీ, సర్పంచ్‌ జయ రత్నకుమారి చేతుల మీదుగా విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో గేమ్స్‌ స్టేట్‌ అబ్జర్వర్‌ సుధీర్‌, బలిరెడ్డి సత్యవతి, హాకీ క్లబ్‌ ఫౌండర్‌ బలిరెడ్డి సూరిబాబు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ, కోచ్‌ రాంబాబు, రామచంద్రరావు, నానాజీ, కోసూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️