ఎల్లీస్‌ పెర్రీ భారీ సిక్సర్‌.. కారు అద్దం బద్దలు.. వీడియో వైరల్‌

Mar 5,2024 12:05 #Cricket, #Sports, #women's ipl

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు స్టార్‌ ప్లేయర్‌ ఎల్లీస్‌ పెర్రీ కొట్టిన ఓ సిక్సర్‌ దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ వేసిన చివరి బంతిని పెర్రీ లాంగాన్‌ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచింది. బంతి నేరుగా వెళ్లి డిస్‌ప్లే బాక్స్‌లో ఉన్న కారు అద్దానికి తగిలింది. దీంతో కారు అద్దం పూర్తిగా పగిలిపోయింది.కారు అద్దం పగిలిపోగానే ఎల్లీస్‌ పెర్రీ ఒక్కసారిగా తలపట్టుకున్నారు. పెర్రీ తన తలపై చేతులు పెట్టుకుని.. అయ్యో అన్నట్లు రియాక్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

➡️