మా పొరపాటుతోనే ఇంగ్లండ్‌కు వరల్డ్‌ కప్‌

Apr 2,2024 23:10 #Sports

మాజీ అంపైర్‌ షాకింగ్‌ కామెంట్స్‌
లండన్‌: 2019 ఐసిసి వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌పై మాజీ అంపైర్‌ ఎరాస్మస్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇటీవల అంపైరింగ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన మరాయిస్‌ ఎరాస్మస్‌ తమ పొరపాటుతోనే ఇంగ్లండ్‌ విశ్వ విజేతగా నిలిచిందని చెప్పుకొచ్చాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌ తగిలడంతో బంతి బౌండరీకి వెళ్లింది. దాంతో, నేను కుమర ధర్మసేన కాసేపు చర్చించి ఆరు పరుగులు ఇచ్చాం. అయితే.. మరుసటి రోజు ఉదయం ధర్మసేన ‘మనం పెద్ద తప్పు చేశాం’ అన్నాడు. ఇద్దరం సిక్స్‌, సిక్స్‌, అవును సిక్స్‌ అని సిగల్‌ ఇచ్చాం. కానీ, ఐదు పరుగులే ఇవ్వాల్సింది’ అని ఎరాస్మస్‌ తెలిపాడు. ఐసిసి రూల్స్‌ ప్రకారం బ్యాటర్‌ పరుగు పూర్తి చేశాక ఓవర్‌ త్రోకు పరుగులు ఉండవు. ఒకవేళ పరుగు తీస్తున్న క్రమంలో బంతి ఓవర్‌ త్రో కారణంగా బంతి బౌండరీకి వెళ్తే అదనంగా 4పరుగులు ఇవ్వాలి. కానీ, ఈ నియమాలు పాటించని ఎరాస్మస్‌, ధర్మసేనలను అంపైర్‌ సైమన్‌ టైఫెల్‌ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.

➡️