దీప్తి దెబ్బకు ఇంగ్లండ్‌ ఢమాల్‌

Dec 15,2023 22:15 #Sports

7 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన స్పిన్నర్‌

భారీ ఆధిక్యత దిశగా భారత మహిళల జట్టు

ముంబయి: ఇంగ్లండ్‌ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళలజట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 428పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన.. ఇంగ్లండ్‌ జట్టును కేవలం 136 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ 6వికెట్ల నష్టానికి 186పరుగులు చేయడంతో భారతజట్టుకు ఇప్పటికే 478పరుగుల భారీ ఆధిక్యత లభించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 6వికెట్ల నష్టానికి 410పరుగులతో గురువారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌.. రెండో రోజు ఆటలో 428 పరుగులకు ఆలౌటైంది. అనంతరం, తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ను తొలుత స్నేV్‌ా రాణా, పూజ వస్త్రాకర్‌, రేణుకా సింగ్‌ కొట్టడి చేశారు. ఆ తర్వాత లోయర్‌ ఆర్డర్‌ పని దీప్తి శర్మ చూసింది. పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ హడలెత్తించింది. దీప్తి కేవలం 7పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టింది. దీప్తి శర్మ కేవలం 5.3 ఓవర్లలో 4 ఓవర్లు మెయిడెన్లు వేసి ఐదు వికెట్లు తీసింది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 35.3ఓవర్లలో కేవలం 136 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్‌ జట్టులో స్కీవర్‌ బ్రంట్‌(59) అర్ధసెంచరీతో రాణించింది. దీంతో భారత్‌కు 292 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ భారీ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత మహిళల జట్టు శుక్రవారం ఆట నిలిచే సమయానికి 6వికెట్ల నష్టానికి 186పరుగులు చేసింది. క్రీజ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(44), పూజ వస్త్రాకర్‌(17) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో భారతజట్టుకు ఇప్పటికే 478పరుగుల భారీ ఆధిక్యత లభించింది. డీన్‌కు నాలుగు, ఎక్లేస్టోన్‌కు రెండు వికెట్లు దక్కాయి. స్కోర్‌బోర్డు..ఇండియా మహిళల తొలి ఇన్నింగ్స్‌ 428ఆలౌట్‌ఇంగ్లండ్‌ మహిళల తొలి ఇన్నింగ్స్‌: బ్యూమౌంట్‌ (రనౌట్‌) పూజవస్త్రాకర్‌ 10, డంక్లే (బి)రేణుక సింగ్‌ 11, హీథర్‌ నైట్‌ (ఎల్‌బి)పూజ వస్త్రాకర్‌ 11, స్కీవర్‌ బ్రంట్‌ (బి)ఏ్నV్‌ా రాణా 59, వాట్‌ (సి)రోడ్రిగ్స్‌ (బి)దీప్తి 19, జోన్స్‌ (సి)షెఫాలీ వర్మ (బి)దీప్తి 12, ఎక్లేస్టోన్‌ (బి)దీప్తి 0, ఛార్లెస్‌ డీన్‌ (ఎల్‌బి)స్నేV్‌ా రాణా 0, క్రాస్‌ (సి అండ్‌ బి) దీప్తి 1, లారెన్‌ ఫ్లియర్‌ (బి)దీప్తి 5, లారెన్‌ బెల్‌ (నాటౌట్‌) 0, అదనం 8, (35.3ఓవర్లలో ఆలౌట్‌) 136పరుగులు.

వికెట్ల పతనం: 1/13, 2/28, 3/79, 4/108, 5/126, 6/126, 7/130, 8/131, 9/135, 10/136

బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 9-1-32-1, స్నే రాణా 6-0-25-2, పూజవస్త్రాకర్‌ 9-1-39-1, గైక్వాడ్‌ 6-0-25-0, దీప్తి శర్మ 5.3-4-7-5.

ఇండియా రెండో ఇన్నింగ్స్‌: షెఫాలీ వర్మ (సి)ఎక్లేస్టోన్‌ (బి)ఛార్లెస్‌ డీన్‌ 33, స్మృతి మంధాన (సి)బ్యూమౌంట్‌ (బి)ఎక్లేస్టోన్‌ 26, యాస్తికా భాటియా (సి)బ్యూమౌంట్‌ (బి)ఎక్లేస్టోన్‌ 9, జెమిమా రోడ్రిగ్స్‌ (సి)బ్యూమౌంట్‌ (బి)ఛార్లీ డీన్‌ 27, హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ (బ్యాటింగ్‌) 44, దీప్తి శర్మ (ఎల్‌బి)ఛార్లీ డీన్‌ 20, స్నే రాణా (బి)ఛార్లీ డీన్‌ 0, పూజ వస్త్రాకర్‌ (బ్యాటింగ్‌) 17, అదనం 10. (42ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 186పరుగులు.

వికెట్ల పతనం: 1/61, 2/71, 3/77, 4/109, 5/133, 6/133బౌలింగ్‌: లారెన్‌ బెల్‌ 3-1-6-0, ఎక్లేస్టోన్‌ 15-2-76-2, ఛార్లోట్‌ డీన్‌ 19-3-68-4, కేట్‌ క్రాస్‌ 3-0-13-0, లారెన్‌ ఫిల్లర్‌ 2-0-13-0

➡️