FIDE Candidates Chess 2024: ప్రజ్ఞానంద, విదిత్‌ విజయాలు

Apr 11,2024 22:21 #chess player, #Sports

న్యూఢిల్లీ : ఫిడె క్యాండిడేట్స్‌ చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ఆరో రౌండ్‌లో అదరగొట్టారు. ఐదో రౌండ్‌లో డ్రాలు ఎదుర్కొన్న ప్రజ్ఞానంద, విదిత్‌లు 24 గంటల్లోనే విజయాలతో పుంజుకున్నారు. ఆరో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో సెమీ టర్రాస్‌ డిఫెన్స్‌లో నిజత్‌ అబసోవ్‌పై విజయం సాధించాడు. విదిత్‌ గుజరాతీ సైతం 40 ఎత్తులో సిరిసిలియన్‌ సోజెన్‌ ఎటాక్‌లో అలిరెజాపై గెలుపొందాడు. డి. గుకేశ్‌ కీలక మ్యాచ్‌లో హికారు నకమురతో మ్యాచ్‌ను 40 ఎత్తుల్లో డ్రా చేసుకున్నా.. పాయింట్ల పట్టికలో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇయాన్‌, టాప్‌ సీడ్‌ ఫాబియానోలు తమ మ్యాచ్‌ను 40 ఎత్తుల్లో డ్రాగా ముగించారు.

➡️