తెలుగు టైటాన్స్‌కు తొలి విజయం

Dec 23,2023 12:36 #pro kabaddi, #Sports

ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 37-36తో హరియాణా స్టీలర్స్‌ జట్టుపై గెలిచింది. టైటాన్స్‌ కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ అత్యధికంగా 10 పాయింట్లు, అజిత్‌ పవార్‌ 7 పాయింట్లు సాధించారు. కాగా తెలుగు టైటాన్స్‌ ఆరింట ఐదు ఓడగా.. తాజా విజయంతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 46-33తో తమిళ్‌ తలైవాస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో సుధాకర్‌ అత్యధికంగా 11 పాయింట్లు , మంజీత్‌ 8 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో పట్నా పైరేట్స్‌ 6వ స్థానంలో ఉంది.

➡️