భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్‌ కన్నుమూత..

Feb 13,2024 13:34 #Cricket, #Sports

భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్‌ కన్నుమూశారు. ఆయన వయసు (95). వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 12 రోజులుగా ఐసీయులో ఉన్న దత్తాజీరావు ఈ తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు పీటీఐకి తెలిపారు.

బీసీసీఐ సంతాపం

దత్తాజీరావు మృతిపై బీసీసీఐ సంతాపం ప్రకటించింది. ‘భారత మాజీ కెప్టెన్‌, టీమిండియా అత్యంత వద్ధ టెస్ట్‌ క్రికెటర్‌ దత్తాజీరావు గైక్వాడ్‌ మరణంపై ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. గైక్వాడ్‌ కుటుంబంకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని బీసీసీఐ ఎక్స్‌లో పేర్కొంది. 1952-1961 మధ్య భారత్‌ తరపున 11 టెస్టులు ఆడిన గైక్వాడ్‌.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు. 1959 ఇంగ్గండ్‌ పర్యటనలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓడిపోయింది. 1952లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన దత్తాజీరావు.. 1961లో చెన్నైలో పాకిస్థాన్‌పై చివరి మ్యాచ్‌ ఆడారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 1947 నుంచి 1961 కాలంలో బరోడాకు దత్తాజీరావు గైక్వాడ్‌ ప్రాతినిథ్యం వహించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 47.56 సగటుతో 3139 పరుగులు చేశారు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి.

 

➡️