అంకిత, రుతుజ శుభారంభం

Apr 9,2024 21:15 #Sports, #Tennis

ముంబయి: బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌లో భారత మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణులు శుభారంభం చేశారు. ఆసియా పసిపిక్‌ ఓషియానాలో భాగంగా ఫిజితో మంగళవారం జరిగిన పోటీలో భారత్‌ తొలిరోజు 3-0 ఆధిక్యతలో నిలిచింది. రుతుజ భోంసాలే 6-1, 6-3తో ఫిజీకి చెందిన తరణి కమోరును చిత్తుచేయగా.. మరో సింగిల్స్‌లో శ్రీవల్లి రష్మిక 6-1, 6-తో మెహితా బూషీని ఓడించింది. ఏకపక్షంగా సాగిన మూడో సింగిల్స్‌లో స్టార్‌ క్రీడాకారిణి అంకిత రైనా ప్రత్యర్ధిని సునాయాసంగా చిత్తుచేసింది. డేవిస్‌కప్‌ అర్హత టోర్నీకి దక్షిణ, నైరుతి, మధ్య, పశ్చిమ పసిపిక్‌ దేశాలనుంచి బిల్లీ జీన్‌ కప్‌ నుంచి రెండుజట్లు అర్హత సాధించేందుకు ఈ పోటీలు జరుగుతున్నాయి. రెండోరౌండ్‌లో భారతజట్టు చైనాతో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లతోపాటు కొరియా, చైనీస్‌ తైపీ, నూజిలాండ్‌ జట్లు కూడా పాల్గొంటున్నాయి. మొత్తం 6జట్లలో ఆసియా/ఓషియానియా గ్రూప్‌ నుంచి రెండు జట్లు ప్లే-ఆఫ్‌కు చేరనున్నాయి. ఆ రెండుజట్లు గ్రూప్‌-2కు అర్హత సాధిస్తాయి.

➡️