Chess: టాప్‌లోనే గుకేశ్‌, నెపోనిచ్‌

Apr 16,2024 20:24 #chess player, #Sports

న్యూఢిల్లీ: క్యాండిడేట్‌ ఛెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ డి. గుకేశ్‌ తన హవా కొనసాగిస్తున్నాడు. మంగళవారం 10వ రౌండ్‌ ముగిసే సరికి గుకేశ్‌, నెపోనిచ్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఇక అరపాయింట్‌ వ్యత్యాసంతో ఆర్‌. ప్రజ్ఞానంద, ఫాబినో కరునా, హికారు నకమురా 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక భారత్‌కు చెందిన విదిత్‌ గుజరాతీ 6పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నాడు. మంగళవారం జరిగిన 10వ రౌండ్‌ పోటీలోగుకేశ్‌, నెపోనిచ్‌ ప్రత్యర్థులతో మ్యాచ్‌లను డ్రాగా ముగించారు. దీంతో వీరిద్దరూ 6పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో టింగ్జి లీ, జోంగీ టాన్‌ 6.5పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. కోనేరు హంపి 4.5పాయింట్లతో 5వ స్థానంలో, ఆర్‌. వైశాలి 3.5పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నారు.

➡️