ఐదో టి20లోనూ గెలుపే..

May 10,2024 07:59 #Sports

బంగ్లాదేశ్‌పై హర్మన్‌ప్రీత్‌ సేన క్లీన్‌స్వీప్‌
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో, చివరి టి20లోనూ భారత మహిళల జట్టు గెలిచి 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. బంగ్లాదేశ్‌ మహిళలతో గురువారం జరిగిన ఐదో టి20లో టీమిండియా మహిళలజట్టు 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 156పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్‌ మహిళలు 20ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 135పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన హర్మన్‌ప్రీత్‌ తొలిగా బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. స్టార్‌ ఓపెనర్‌ షెఫాలీ వర్మ(14) నిరాశపరిచినా.. స్మృతి మంధాన(33) బ్యాటింగ్‌లో రాణించింది. ఆ తర్వాత హేమలత(37), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌(30) బ్యాటింగ్‌లో మెరిసారు. దీంతో హర్మన్‌ప్రీత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 156పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లు నహిదా అక్తర్‌, రెబెయా ఖాతూన్‌లకు రెండేసి వికెట్లు దక్కాఇ. ఛేదనలో బంగ్లాదేశ్‌ మహిళలజట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 6వికెట్లు కోల్పోయి 135పరుగులే చేయగల్గింది. రితూ మోని(37), షోఫియా ఖాతున్‌(28) బ్యాటింగ్‌లో రాణించగా.. రాధా యాదవ్‌కు మూడు వికెట్లు చేజిక్కించుకొని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులను దక్కించుకుంది. దీంతో చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్‌నుంచి బయటపడాలన్న బంగ్లాదేశ్‌ మహిళల జట్టు ఆశలు అడియాశలయ్యాయి.
స్కోర్‌బోర్డు..
ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: షెఫాలీ వర్మ (సి)ఫరిహా (బి)సుల్తానా ఖాతున్‌ 14, స్కృతి మంధాన (ఎల్‌బి)నహిదా అక్తర్‌ 33, హేమలత (సి)శోభన (బి)రెబెయా ఖాన్‌ 37, హర్మన్‌ప్రీత్‌ (ఎల్‌బి)నహిదా అక్తర్‌ 30, రీచా ఘోష్‌ (నాటౌట్‌) 28, సజన (ఎల్‌బి)రెబెయా ఖాన్‌ 1, దీప్తి శర్మ (నాటౌట్‌) 5, అదనం 8. (20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 156పరుగులు.
వికెట్ల పతనం: 1/25, 2/62, 3/122, 4/122, 5/124
బౌలింగ్‌: ఫరిహా 2-0-12-0, సుల్తానా 3-0-26-1, షోరిఫా 2-0-16-0, రెబెయా ఖాన్‌ 4-0-28-2, నహిదా అక్తర్‌ 4-0-27-2, రితు మోని 2-0-21-0, షోమా అక్తర్‌ 3-0-22-0
బంగ్లాదేశ్‌ మహిళల ఇన్నింగ్స్‌: దిలారా అక్తర్‌ (సి)పూజ వస్త్రాకర్‌ (బి)రాధా యాదవ్‌ 4, శోభనా మో్సఈ్ట (సి)రాధా యాదవ్‌ (బి)టిటాస్‌ సద్ధు 13, రెబ్యా హైదర్‌ (ఎల్‌బి)రాధా యాదవ్‌ 20, నిగర్‌ సుల్తానా (బి)రాధా యాదవ్‌ 7, రీతు మోని (సి)హర్మన్‌ప్రీత్‌ (బి)శోభన 1, షోరితా ఖాతున్‌ (నాటౌట్‌) 28, రెబెయా ఖాన్‌ (నాటౌట్‌) 14, అదనం 11. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 135పరుగులు.వికెట్ల పతనం: 1/19, 2/26, 3/47, 4/48, 5/52, 6/109
బౌలింగ్‌: టిటాస్‌ సద్ధు 4-0-27-1, పూజ వస్త్రాకర్‌ 3-0-28-0, రాధా యాదవ్‌ 4-0-24-3, సజన 2-0-12-0, దీప్తి శర్మ 3-0-10-0, శోభన 4-0-25-2.

➡️