ట్రావిస్‌ హెడ్‌కు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఎంపికయ్యాడు. భారత పేసర్‌ మహ్మద్‌ షమి, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా ఈ అవార్డు రేసులో ఉండగా.. చివరకు హెడ్‌ విజేతగా నిలిచాడు.

  • మహిళల క్రికెట్‌లో నహిదా అక్టర్‌

మహిళల క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ యువ స్పిన్‌ సంచలనం నహిదా అక్టర్‌ నవంబర్‌ నెలకుగాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి బంగ్లాదేశ్‌ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. బంగ్లా టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ఫర్గానా, పాక్‌ స్పిన్నర్‌ సాదియా ఇక్బాల్‌ను వెనక్కినెట్టి నహిదా ఈ అవార్డును దక్కించుకుంది.

➡️