యశస్వీ జైశ్వాల్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..

Mar 12,2024 17:29 #Cricket, #icc award, #Sports

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను జైశ్వాల్‌కు ఈ అవార్డు దక్కింది. గత నెలలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడిన యశస్వీ ఏకంగా రెండు డబుల్‌ సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ సిరీస్‌లో జైశ్వాల్‌ ఏకంగా 712 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ అన్నాబెల్‌ సదర్లాండ్‌ ఎంపికైంది. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సదర్లాండ్‌ అద్భుతంగా రాణించింది.

➡️