26 ఏళ్ల శ్రీలంక రికార్డును బ్రేక్‌ చేసిన భారత్‌

Dec 16,2023 15:59 #Sports

26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్‌ బ్రేక్‌ చేసి.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా భారత్‌ రికార్డులకెక్కింది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఈ వరల్డ్‌ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రికార్డు శ్రీలంక మహిళల జట్టు పేరిట ఉండేది. 1997లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 309 పరుగుల తేడాతో ఓడించింది. తాజా మ్యాచ్‌తో 26 ఏళ్ల శ్రీలంక రికార్డును భారత్‌ బ్రేక్‌ చేసింది.

➡️