పరువు కోసం ఆస్ట్రేలియా.. సిరీస్‌పై భారత్‌ కన్ను

  • నేడు మూడో టీ20

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మంగళవారం గౌహతిలో జరగనుంది. ఐదు మ్యాచ్‌ ల సిరీస్‌ లో తొలి రెండింటిలో విజయం సాధించిన భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌ను నిలుపుకోవాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు. ఆఖర్లో రింకు సింగ్‌ ఫినిషర్‌గా రావడం టీమ్‌ ఇండియాకు కలిసివచ్చే అంశం. మరోవైపు స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆడమ్‌ జంపా వంటి ఆటగాళ్లలు రాణించకపోవడంతో ఆస్ట్రేలియా కంగారు పడుతోంది. అయితే సిరీస్‌ ను నిలుపుకోవాలనే ఒత్తిడితో ఉన్న ఆస్ట్రేలియన్లు ఈ మ్యాచ్‌ లో పుంజుకునే అవకాశం ఉందని కూడా క్రికెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌ నేడు గౌహతిలోని బసపర క్రికెట్‌ గ్రౌండ్‌ లో జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ ను స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. పిచ్‌ గమనిస్తే.. గౌహతిలోని బస్సపర గ్రౌండ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.

జట్లు (అంచనా)
భారత్‌: సూర్యకుమార్‌ (కెపె్టన్‌), రుతురాజ్, యశస్వి జైస్వాల్, ఇషాన్‌ కిషన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్‌‡్షదీప్, ప్రసిధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌.
ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్‌ (కెపె్టన్‌), స్టీవ్‌ స్మిత్, షార్ట్, జోష్‌ ఇన్‌గ్లిస్, మ్యాక్స్‌వెల్, టిమ్‌ డేవిడ్, స్టోయినిస్, ఆడమ్‌ జంపా, సీన్‌ అబాట్, నాథన్‌ ఎలిస్, తనీ్వర్‌ సంఘా.

➡️