IND vs ENG : ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. బుమ్రాకు ఆరు వికెట్లు

Feb 3,2024 16:46 #Cricket, #Sports

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులోని రెండో రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. రెండో రోజు మొదట్లో జైస్వాల్‌ అద్భుత డబుల్‌ సెంచరీ చేసి అవుట్‌ అయ్యాడు అనంతరం బ్యాటర్లు వెంట వెంటనే అవుట్‌ కావడంతో భారత్‌.. 396 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన ఇంగ్లాండ్‌ జట్టుకు బుమ్రా ఆరు కీలక వికెట్లు తీసి షాక్‌ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్‌ 55.5 ఓవర్లకు 253 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో జాక్‌ క్రాలీ 76, బెన్‌ స్ట్రోక్స్‌ 47, జానీ బైర్లుథౌ 27, ఒల్లీ పోప్‌ 23, బెన్‌ డుక్వెట్‌ 21, టామ్‌ హార్టులే 21 పరుగులు చేశారు.పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా 6, కుల్దీప్‌ యాదవ్‌ 3, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్లు పడగొట్టారు.

  • తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. 243/9

ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన టామ్‌ హార్లీ బుమ్రా బౌలింగ్‌లో శుభ్‌మాన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లాండ్‌ ప్రస్తుతం 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.

  • స్టోక్స్‌ బౌల్డ్‌

బుమ్రా బౌలింగ్‌లో బెన్‌ స్టోక్స్‌(47) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. స్టోక్స్‌ స్థానంలో జేమ్స్‌ ఆండర్సన్‌ క్రీజులో కి వచ్చాడు. స్కోరు: 230-8(50)

  • రెహాన్‌ అహ్మద్‌ ఔట్‌.. ఇంగ్లాండ్‌ 182/7

కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రెహాన్‌ అహ్మద్‌ ఔటయ్యాడు. 15 బంతుల్లో 5 పరుగులు చేసిన రెహాన్‌ అహ్మద్‌ శుభ్‌మాన్‌గిల్‌కు క్యాచ్‌ఇచ్చి పెవలియన్‌కు చేరాడు. క్రీజులోకి టామ్‌ హార్ట్లీ వచ్చాడు. స్టోక్స్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ స్కోరు 182/7 ఉంది.

  • కష్టాల్లో ఇంగ్లాండ్‌.. 173/6

రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ ఇంగ్లాండ్‌ కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు కోల్పోతోంది. బెన్‌ డకెట్‌ 21, ఓలీ పోప్‌ 23, రూట్‌ 5, బెయిర్‌స్టో 25 తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరగా ఇప్పుడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెన్‌ ఫోక్స్‌ 5 పరుగులు చేసి కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లాండ్‌ స్కోరు ప్రస్తుతం 173/6గా ఉంది.

  • బెయిర్‌ స్టో ఔట్‌.. ఇంగ్లాండ్‌ 159/5

25 పరుగులు చేసిన బెయిర్‌స్టో బుమ్రా బౌలింగ్‌లో శుభ్‌మాన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లాండ్‌ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రీజులోకి బెన్‌ ఫోక్స్‌ వచ్చాడు. బెన్‌స్టోక్స్‌ 8 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ 233 పరుగులు వెనుకబడి ఉంది.

  • టీ బ్రేక్‌.. ఇంగ్లాండ్‌ 155/4

ఇంగ్లాండ్‌తో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ టీ బ్రేక్‌ సమయానికి 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బెన్‌ డకెట్‌ 21, జాక్‌ క్రాలీ 76 , ఓలీ పోప్‌ 23, రూట్‌ 5 పరుగులు చేసి పెవలియన్‌కు చేరారు. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్‌స్టో (24), బెన్‌ స్టోక్స్‌ (5)పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • ఓలీ పోప్‌ క్లీన్‌ బౌల్డ్‌

ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఓలీ పోప్‌ను బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 31 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 143/4. క్రీజులో స్టోక్స్‌, బెయిర్‌స్టో ఉన్నారు.

  • మూడో వికెట్‌ డౌన్‌

ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన రూట్‌ బుమ్రా బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి బెయిర్‌ స్టోవచ్చాడు. 27 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌ 134/3 ఉంది.

  • జాక్‌ క్రాలీ ఔట్‌.. ఇంగ్లాండ్‌ 118/2

78 బంతుల్లో 76 పరుగులు చేసిన జాక్‌ క్రాలీ అక్షర్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో రూట్‌(4), ఓలీపోప్‌ (17) ఉన్నారు.

  • జాక్‌ క్రాలీ 50.. ఇంగ్లండ్‌.. 72/1

లంచ్‌ బ్రెక్‌ తరువాత ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జాక్‌ క్రాలీ 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో జాక్‌ క్రాలీ 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ స్కోర్‌ 72/1 ఉంది.

  • తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. 59/1

ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన బెన్‌ డకెట్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 1 వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులోకి పోప్‌ వచ్చాడు.

  • లంచ్‌ బ్రేక్‌.. ఇంగ్లండ్‌ స్కోర్‌: 32/0

రెండో రోజు తొలి సెషన్‌ ముగిసింది.ఈ సెషన్లో భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. దీంతో భారత్‌ 396 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 32/0 పరుగులు చేసింది. లంచ్‌ విరామానికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కోల్పోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో జాక్‌ క్రాలీ(15), బెన్‌ డకెట్‌(17) పరుగులతో ఉన్నారు.

  • టీమిండియా 396 అలౌట్‌..

396 పరుగులకు టీమిండియా అలౌట్‌ అయ్యింది. 336 పరుగులతో రెండో రోజు ఆట మొదలు పెట్టిన టీమిండియా.. అదనంగా 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.  290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో జైశ్వాల్‌ 209 పరుగులు చేశాడు. రోహిత్ 14, గిల్ 34, శ్రేయశ్ 27, రజత్ పాటిదార్ 32, భరత్ 17, అశ్విన్ 20 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ ఆండర్సన్‌, రెహాన్‌ ఆహ్మద్‌, బషీర్‌ తలా 3 వికెట్లు పడగొట్టారు.

  • తొమ్మిదో వికెట్‌ డౌన్‌..
    395 పరుగుల వద్ద టీమిం‍డియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన జస్ప్రీత్‌ బుమ్రా.. రెహన్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
  • యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ

ఇంగ్లాండ్‌తో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ కొట్టాడు. 280 బంతుల్లో 207 పరుగులతో క్రీజులో నాటౌట్‌గా నిలిచాడు. తన కెరీర్‌ లో జైస్వాల్‌ తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. 18 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ కొట్టాడు. ఇక భారత్‌7 వికెట్లు నష్టపోయి 380 పరుగులు చేసింది.

  • అశ్విన్‌ ఔట్‌

టీమిండియా 7వ వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన అశ్విన్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కుల్‌దీప్‌ వచ్చాడు. టీమిండియా 7 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది.

  • రెండో రోజు ఆట ప్రారంభం

విశాఖ వేదికగా ఇండియా వర్సెస్‌ ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న సెకండ్‌ టెస్ట్‌ రెండో రోజు మ్యాచ్‌ శనివారం ప్రారంభమైంది. ఓవర్‌ నైట్‌ 336/6 స్కోరుతో భారత్‌ తన మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. క్రీజ్‌లోకి యశస్వి జైస్వాల్‌ (179), అశ్విన్‌ (5) వచ్చారు. ఈరోజు తొలి ఓవర్‌ను బషీర్‌ వేస్తున్నారు.

➡️