IND vs ENG, 4th Test : రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా 219/7

Feb 24,2024 16:50 #Cricket, #England, #India, #Sports, #test

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యేసరికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. టామ్‌ హార్లే రెండు, జేమ్స్‌ ఆండర్సన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(73) ఒక్కడే అర్థ శతకం బాదాడు. మిగతా వాళ్లలో శుబ్‌మన్‌ గిల్‌ 38 పరుగలతో ఫర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సరికి ధ్రువ్‌ జురెల్‌ 30, కుల్దీప్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో 302/7 ఓవర్‌ నైట్‌ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి 353 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌ 3, సిరాజ్‌ 2 వికెట్లు తీయగా అశ్విన్‌కు ఒక వికెట్‌ దక్కింది.

  • ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

అశ్విన్‌ రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. టామ్‌ హార్ట్లే బౌలింగ్లో ఆశ్విన్‌ (1) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కుల్‌దీప్‌ యాదవ్‌, ధ్రువ్‌ జురెల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • సర్ఫరాజ్‌ ఔట్‌

53 బంతుల్లో 14 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఔటయ్యాడు. టామ్‌ హార్ట్లీ, బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఆశ్విన్‌ వచ్చాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 171/6 గా ఉంది. క్రీజులోకి కుల్‌దీప్‌ వచ్చాడు.

  • యశస్వి జైస్వాల్‌ ఔట్‌

73 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ ఐదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరారడు. ఇంగ్లండ్‌ యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు: 161/5 (46.4). ధ్రువ్‌ జురెల్‌ క్రీజులోకి వచ్చాడు. సర్ఫరాజ్‌ 10 పరుగులపై బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • జడేజా ఔట్‌.. టీమిండియా 130/4

టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో ఓలీపోప్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. భారత్‌ స్కోర్‌: 130/4. క్రీజులోకి సర్ఫరాజ్‌ ఖాన్‌ వచ్చాడు.

  • పాటిదార్‌ ఔట్‌

టీమిండియా ఆటగాడు రజిత్‌ పాటిదార్‌ ఔటయ్యాడు. 17 పరుగులు చేసిన పాటిదార్‌ షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 35 ఓవర్లు ముగిసే సరికి భార స్కోర్‌: 112/3. క్రీజులోకి జడేజా వచ్చాడు.

యశస్వీ జైశ్వాల్‌ 50

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 89 బంతుల్లో అర్ధ శతకాన్ని యశస్వీ పూర్తి చేసుకున్నాడు. 32 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 105/2. జైశ్వాల్‌తో పాటు రజిత్‌ పాటిదార్‌(12) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • గిల్‌ ఔట్‌.. టీమిండియా 86 /2

86 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 38 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి రజిత్‌ పాటిదార్‌ వచ్చాడు. మరో వైపు యశస్వీ జైశ్వాల్‌ నెమ్మదిగా ఆడుతూ.. హఫ్‌ సెంచరీపై కదులుతున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్‌ 77 బంతుల్లో 44 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • నిలకడగా ఆడుతున్న శుబ్‌మన్‌, యశస్వీ .. 22 ఓవర్లు 79/1

లంచ్‌ విరామం తరువాత టీమిండియా ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నాడు.. యశస్వీ జైశ్వాల్‌ 65 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో (42) , శుబ్‌మన్‌ గిల్‌ 59 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో (34) పరుగులు చేశారు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 79 పరుగులు చేసింది.

  • టీమిండియాకు బిగ్‌ షాక్‌.. రోహిత్‌ శర్మ ఔట్‌

టీమిండియాకు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. ఆండర్సన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కేవలం 2 పరుగులే చేసి రోహిత్‌ ఔటవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడినట్లు అయ్యింది. క్రీజులోకి శుభ్‌మాన్‌గిల్‌ వచ్చాడు.

రాంచీ టెస్టు.. ఇంగ్లాండ్‌ 353 ఆలౌట్‌

తొలి ఇన్నింగ్స్‌ లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌటైంది. 302/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 51 పరుగులు చేసింది. రెండో రోజు మూడు వికెట్లు జడేజాకే దక్కాయి. రూట్‌ 122 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో రాబిన్సన్‌ 58, బెన్‌ ఫోక్స్‌ 47, జాక్‌ క్రాలే 42, బెయిర్‌ స్టో 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌ 3, సిరాజ్‌ 2 వికెట్లు తీయగా అశ్విన్‌కు ఒక వికెట్‌ దక్కింది.

  • తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌..

ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షోయబ్‌ బషీర్‌.. పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 103 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 351/9

  • ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

347 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 58 పరుగులు చేసిన ఓలీ రాబిన్సన్‌.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

  • రాబిన్సన్‌ 50

302/7 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ భారత పేసర్లను దాటిగా ఎదుర్కోంటుంది. ఈ క్రమంలో ఓలీ రాబిన్సన్‌ 81 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ స్కోరు 331 పరుగులుగా ఉంది. క్రీజులో జో రూట్‌(108)తో ఉన్నాడు.

నాల్గో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభం

రాంఛీ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్‌ ఎటాక్‌ను మహ్మద్‌ సిరాజ్‌ ప్రారంభించాడు. క్రీజులో జో రూట్‌(106), ఓలీ రాబిన్సన్‌(31) పరుగులతో ఉన్నారు. కాగా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.

తుది జట్లు

భారత్‌: యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభమన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆకాశ్‌ దీప్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌

ఇంగ్లండ్‌ : జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఆలీ పోప్‌, జో రూట్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), బెన్‌ ఫోక్స్‌(వికెట్‌ కీపర్‌), టామ్‌ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్‌, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ ఆండర్సన్‌

➡️