IND vs ENG : రోహిత్‌-జడ్డూ సూపర్ ఇన్నింగ్స్‌.. టీమిండియా 315/5

Feb 15,2024 17:18 #Cricket, #England, #India, #test match
  • సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ
  • తొలిరోజు ముగిసిన ఆట

రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. రోహిత్‌, జడ్డూ, సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి టీమిండియా 315 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(131), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(110- నాటౌట్‌) శతకాలతో మెరిశారు.అరంగేట్ర బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (62) పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ దురదష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(10), శుబ్‌మన్‌ గిల్‌(0), రజత్‌ పాటిదార్‌(5) పూర్తిగా నిరాశపరిచారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో పేసర్‌ మార్క్‌ వుడ్‌ మూడు వికెట్లు తీయగా.. స్పిన్నర్‌ టామ్‌ హార్లేకు ఒక వికెట్‌ దక్కింది.

  • జడేజా 100.. భారత్‌ 315/5

 రాజ్‌ కోట్‌ లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా శతంకం సాధించాడు. 198 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్‌ల సాయంతో వంద పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కాగా ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 5 వికెట్ల నష్టానికి 315 పరుగులుగా ఉంది.

  • సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్‌

66 బంతుల్లో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇన్నింగ్స్‌ 81.5 ఓవర్‌లో సింగిల్‌కు వెళ్లి రనౌట్‌ అయ్యాడు. భారత్‌ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. క్రీజులో జడేజా 99 పరుగులు మీద ఉన్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ నైట్‌ వాచ్‌మెన్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు.

  • సర్ఫరాజ్‌ ఖాన్‌ 50.. భారత్‌ 299/4

 అరంగేట్ర బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ 48 బంతుల్లోనే 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. మరోవైపు.. జడ్డూ 186 బంతుల్లో 96 పరుగులతో ఆడుతున్నాడు. 77 ఓవర్లకు భారత్‌ స్కోరు 299/4గా ఉంది.

  • రోహిత్‌ శర్మ ఔట్‌.. భారత్‌ 237/4

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (131) ఔటయ్యాడు. 63.3 వద్ద మార్క్‌ వుడ్‌ వేసిన బంతికి భారీ షాట్‌కు యత్నించి బెన్‌ స్టోక్స్‌ చేతికి చిక్కాడు.క్రీజులోకి సర్ఫరాజ్‌ ఖాన్‌ వచ్చాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 237/4 గా ఉంది.

  • రోహిత్‌ శర్మ సెంచరీ.. భారత్‌ స్కోరు 202/3

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీ చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భార 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జడేజాతో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 157 బంతుల్లో 2 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో సెంచరీని సాధించాడు. తన టెస్ట్‌ కెరీర్‌ లో 11వ సెంచరీ. మరో ఎండ్‌లో జడేజా కూడా అద్భుతమైన టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్‌ 106 పరుగులు, జడేజా 69 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరూ కలిసి 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 3 వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది.

  • టీ బ్రేక్‌.. భారత్‌ స్కోరు 185/3

మూడో టెస్టు తొలి రోజు టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ 185 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (97), రవీంద్ర జడేజా (68) పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 260 బంతుల్లో 152 పరుగులు చేశారు.

  • రవీంద్ర జడేజా హాఫ్‌ సెంచరీ

33 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా 51 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. రోహిత్‌ శర్మతో కలసి ఇన్నింగ్ను చక్కదిద్దాడు.క్రీజులో రోహిత్‌ 79, జడేజా 51 పరుగుల వద్ద ఉన్నారు. 44 ఓవర్లుకు భారత్‌ స్కోరు 150/3 గా ఉంది.

  • వంద పరుగులు పూర్తి.. భారత్‌ 111/3

 టీమిండియా వంద పరుగుల మార్కును అందుకుంది. రోహిత్‌ శర్మ 52, రవీంద్ర జడేజా 31 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం 31 ఓవర్లుకు 111-3గా ఉంది.

తొలి రోజు లంచ్‌ బ్రేక్‌.. భారత్‌ 93/3

 ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. 9 ఓవర్లకే యశస్వి జైస్వాల్‌ (10), గిల్‌ (0), పటీదార్‌ (5) పరుగులకే ఔటయ్యారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జడేజా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నారు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి రోహిత్‌ శర్మ 52, రవీంద్ర జడేజా 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 2, హార్ట్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 25 ఓవర్లుకు 93/3 గా ఉంది.

  • రోహిత్‌ శర్మ అర్ధ శతకం.. భారత్‌ 81/3

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న రోహిత్‌ నెమ్మదిగా ఆడుతూ.. 74 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జడ్డూ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు 23 ఓవర్లకు 81/3గా ఉంది.

20 ఓవర్లు పూర్తి.. భారత్‌ 71/3

20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 71పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 60 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేయగా.. జడేజా 28 బంతుల్లో 1 ఫోర్‌ సాయంతో 11 పరగులు చేశాడు. అంతకు ముందు యశస్వి జైస్వాల్‌ (10) రజత్‌ పటీదార్‌(5), గిల్ ఖాతా తెరకముందే అవుటయ్యాడు.

  • మూడో వికెట్‌ డౌన్‌.. భారత్‌ 33/3

మూడో వికెట్‌ డౌన్‌8.5 ఓవర్‌ దగ్గర భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్లీ బౌలింగ్‌లో.. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజత్‌ అవుటయ్యాడు. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. రోహిత్‌ శర్మ 17 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లు ముగిసే సరికి 33-3గా ఉంది.

  • టాస్ గెలిచిన భారత్ – ఆదిలోనే ఎదురుదెబ్బ

ఇంగ్లండ్‌తో భారత్ జట్టు రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌ ఆరంభం అయింది.  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆట ప్రారంభంలోనే భారత్ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన యశస్వి జైస్వాల్‌  కేవలం 10పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన గిల్ ఖాతా తెరకముందే బెన్ కు దొరికిపోయాడు. దీంతో 24పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ(16) ,రజత్‌ పటీదార్‌(5)క్రీజులో ఉన్నారు.

  • సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం

ఈ టెస్ట్ కోసం రోహిత్ ఏకంగా నాలుగు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రాగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం చేశారు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్, కేఎస్ భారత్ స్థానంలో జురెల్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పసర్లతో బరిలోకి దిగుతోంది.

ఇంగ్లండ్ జట్టు తుది జట్టులో ఒక మార్పు చేసింది. స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ను తప్పించి.. మార్క్‌ వుడ్‌కు చోటు కల్పించింది. తొలి రెండు టెస్టుల్లో ఒకే పేసర్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లను ఆడిస్తోంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో జరిగిన రెండు టెస్టుల్లో భారత్‌, ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి.

తుది జట్లు:
భారత్: రోహిత్‌ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌ (కీపర్), ఆర్ అశ్విన్‌, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్‌.

ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.

➡️