ర్యాంకింగ్స్‌లో భారత ఆర్చర్ల హవా

Jun 24,2024 23:36 #Archery Competitions

పురుషుల, మహిళల కేటగిరీల్లో పారిస్‌ బెర్త్‌లు
న్యూఢిల్లీ: భారత ఆర్చర్లు ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు చేసుకున్నారు. పురుషుల, మహిళల కేటగిరీలో విశ్వ క్రీడల బెర్తు సాధించి డబుల్‌ ధమాకా మోగించారు. సోమవారం వరల్డ్‌ ఆర్చరీ రాంకింగ్స్‌ విడుదల చేసింది. ఐదు పోటీల్లో భారత ఆర్చర్లు అర్హత సాధించారు. మహిళా, పురుష ఆర్చర్లు వ్యక్తిగత విభాగంలో.. మిక్స్‌డ్‌ కేటగిరీలో క్వాలిఫై అయ్యారు. ఇక స్క్వాడ్‌ విషయానికొస్తే.. తరుందీప్‌ రారు, ధీరజ్‌ బొమ్మదేవర, ప్రవీణ్‌ జాదవ్‌లు పురుషుల విభాగంలో పోటీ పడనున్నారు.
మహిళల స్క్వాడ్‌లో సీనియర్‌ దీపికా కుమారి, యువకెరటాలు భజన్‌ కౌర్‌, అకింత భకత్‌లు విశ్వ క్రీడల బెర్తు దక్కించుకున్నారు.

మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో..
భారత పురుష, మహిళా ఆర్చర్లు మూడంచెల ఎంపిక దశను దాటి మరీ ఒలింపిక్స్‌ రేసులో నిలిచారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచి విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. చైనా ఆర్చర్లు కూడా పురుషుల కేటగిరీలో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. మహిళల విభాగంలో ఇండోనేషియా ఆర్చర్లకు టీమ్‌ కోటా లభించింది. ప్రతి సెక్షన్‌లో 12 జట్లు పోటీ పడుతాయి. మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో ఐదు జట్లు టైటిల్‌ వేటలో తలపడతాయి.

➡️