బంగ్లాదేశ్‌ పర్యటనకు భారత టీ20 జట్టు ప్రకటన

Apr 16,2024 17:45 #Cricket, #india womens, #Sports

బంగ్లాదేశ్‌ పర్యటన కోసం భారత మహిళా క్రికెట్‌ జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఏప్రిల్‌ 28 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల జట్టును భారత సెలెక్టర్లు ఎంపిక చేవారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధన వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్‌లన్ని ఒకే వేదికలో జరగనున్నాయి.

భారత మహిళా క్రికెట్‌ జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలీ వర్మ, దయాళన్‌ హేమలత, సజన సజీవన్‌, రిచా ఘోష్‌ (వికెట్‌కీపర్‌), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్‌), రాధా యాదవ్‌, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌, అమంజోత్‌ కౌర్‌, శ్రేయాంక పాటిల్‌, సైకా ఇషాక్‌ , ఆశా శోభనా, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, టిటాస్‌ సాధు

ఏప్రిల్‌ 28- తొలి టీ20 (సిల్హెట్‌)
ఏప్రిల్‌ 30- రెండో టీ20 (సిల్హెట్‌)
మే 2- మూడో టీ20 (సిల్హెట్‌)
మే 6- నాలుగో టీ20 (సిల్హెట్‌)
మే 9- ఐదో టీ20 (సిల్హెట్‌)

➡️