రెండో టీ20లో భారత్‌ ఓటమి

Dec 13,2023 10:55 #Sports
  • డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఆతిథ్య జట్టు గెలుపు

దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన రెండో టీ20 మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. లక్ష్య ఛేదన చివరిలో చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్క్రమ్, హెండ్రిక్స్ ఆతిథ్య జట్టును విజయ తీరాలకు చేర్చారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లకు 152 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు 5 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలోనే ఛేదించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ రింకూ సింగ్‌ (68 నాటౌట్), సూర్యకుమార్‌ యాదవ్‌ (56) భారత ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. కోయెట్జీ 3 కీలకమైన వికెట్లు, మార్కో యెన్సెన్, విలియమ్స్, షంసీ, మార్క్రమ్ తలో వికెట్ తీశారు. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెండ్రిక్స్‌ (49), మార్‌క్రమ్‌ (30 చెలరేగి ఆడారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. అర్షదీప్ సింగ్ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి 31 పరుగులు సమర్పించుకున్నాడు. ముకేశ్ కుమార్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ మాత్రమే తీశారు. షంసి (1/18)కి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో వెనుకబడింది. మొదటి మ్యాచ్ వర్షం కారణం రద్దయ్యింది. ఇక చివరి టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది.

➡️