రికార్డుల మోత.. మిచెల్ స్టార్క్ 24.75 కోట్లు.. ప్యాట్‌ కమిన్స్‌రూ.20.50 కోట్లు

Dec 19,2023 15:00 #IPL

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచిల్‌ స్టార్క్‌ రికార్డులకెక్కాడు. స్టార్క్‌ను రూ.24.70 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌  కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్‌ టైటాన్స్‌, కేకేఆర్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆఖరికి గుజరాత్‌ టైటాన్స్‌ టైటాన్స్‌ వెనక్కి తగ్గడంతో కేకేఆర్‌ సొంతం చేసుకుంది. కాగా ఇదే వేలంలో ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డు ధరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది.

  • రూ.20.50 కోట్లకు ప్యాట్‌ కమిన్స్‌ కొనేసిన కావ్యా మారన్‌

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఐపీఎల్‌ వేలంలో చరిత్ర సృష్టించాడు. దుబారులో జరుగుతున్న మినీ వేలంలో కమిన్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. హౌరాహౌరీగా సాగిన వేలం పాటలో కమిన్స్‌ను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 20.50 కోట్ల రికార్డు ధరతో చేజిక్కించుకుంది. ఐపీఎల్‌ లో ఇప్పటివరకు అత్యధిక ధర రికార్డు ఇంగ్లండ్‌ యువ ఆల్‌ రౌండర్‌ శామ్‌ కరన్‌ పేరిట ఉంది. 2023 సీజన్‌ కోసం శామ్‌ కరన్‌ ను పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడా రికార్డును ప్యాట్‌ కమిన్స్‌ బద్దలుకొట్టాడు.

  • రచిన్‌ రవీంద్ర1.80 కోట్లు

రచిన్‌ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలు కాగా… అతడి కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌,ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రమే ఆసక్తి చూపించాయి. చివరికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ బాగా చవకగా రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసింది.

  • ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌కు రూ. 14 కోట్లు..

హొడారిల్‌ మిచెల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 14 కోట్లు పెట్టి దక్కించుకుంది. 

  • హర్షల్ పటేల్‌కు రూ. 11.75 కోట్లు

రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన భారత పేసర్ హర్షల్‌ పటేల్‌కు రూ. 11.75 కోట్లు దక్కాయి. వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

  • శార్దూల్‌కు 4 కోట్లు

టీమిండియా ఆల్‌ రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఈ వేలంలో రూ.4 కోట్లతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో పడ్డాడు. శార్దూల్‌ ఠాకూర్‌ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతడిని చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. శార్దూల్‌ గతంలోనూ చెన్నై జట్టుకు ఆడాడు.

  • పావెల్‌ను రూ.7.40 కోట్ల

వెస్టిండీస్‌ కెప్టెన్‌ రోవ్‌మన్ పావెల్‌కు జాక్‌పాట్‌ తగిలింది. పావెల్‌ను రూ.7.40 కోట్ల భారీ ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగొలు చేసింది. ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా ఉన్న పావెల్‌ కోసం కోల్‌కత్‌ నైట్‌రైడర్స్‌ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఎంతైనా తగ్గేదేలే అని భావించిన రాజస్తాన్‌.. భారీ మొత్తానికి పావెల్‌ను దక్కించుకుంది.

  •  గెరాల్డ్‌ కోయిట్జీ ముంబయి 

రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్‌ కోయిట్జీని రూ. 5 కోట్లతో ముంబయి సొంతం చేసుకుంది.

  • హైదరాబాద్ జట్టుకు ట్రావిస్ హెడ్

వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ ను హైదరాబాద్ జట్టు 6.80 కోట్లకు కొనుగోలు చేసింది.

 ఆర్‌సీబీకి అల్జారీ జోసెఫ్‌ 

రూ. కోటి కనీస ధరతో బరిలోకి దిగిన అల్జారీ జోసెఫ్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢీల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోటీపడ్డాయి. చివరికి రూ. 11.5 కోట్లతో ఆర్‌సీబీ సొంతం చేసుకుంది.

ఉమేశ్ యాదవ్‌కు రూ. 5.8 కోట్లు

భారత సీనియర్‌ పేసర్ ఉమేశ్‌ యాదవ్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన ఉమేశ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ తీసుకుంది.  ఉమేశ్‌ యాదవ్‌ కోసం రూ. 5.8 కోట్లు వెచ్చించింది.

  • ట్రిస్టన్‌ స్టబ్స్‌ను రూ. 50 లక్షలకు ఢీల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.
  • కేఎస్‌ భరత్‌ను రూ. 50 లక్షలకు కోల్‌కతా దక్కించుకుంది.
  • చేతన్‌ సకారియాను రూ. 50 లక్షలకు కోల్‌కతా తీసుకుంది.
➡️