లెజెండ్స్‌ మ్యాచ్‌ రద్దు

Dec 5,2023 09:21 #Cricket, #Sports
  • తదుపరి ఆటలకు సూరత్‌ పయనం

ప్రజాశక్తి -పిఎం పాలెం (విశాఖపట్నం): లెజెండ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ రద్దయింది. విశాఖ పిఎం పాలెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఎసిఎ – విడిసిఎ క్రికెట్‌ స్టేడియంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు మణిపాల్‌ టైగర్స్‌, అర్బన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉండగా మిచౌంగ్‌ తుపాను కారణంగా ఈ మ్యాచ్‌ను రద్దు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. టోర్నమెంట్‌లో భాగంగా తదుపరి మ్యాచ్‌లు ఆడేందుకు క్వాలిఫై అయిన గుజరాత్‌ జైంట్స్‌, మణిపాల్‌ టైగర్స్‌, అర్బన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, ఇండియా క్యాపిటల్‌ జట్లు సూరత్‌కు బయలుదేరి వెళ్లాయి. ఈ నెల రెండో తేదీన ఇండియా క్యాపిటల్‌-మణిపాల్‌ టైగర్స్‌, మూడున గుజరాత్‌ జైంట్స్‌ – సదరన్‌ సూపర్‌స్టార్స్‌ జట్లు తలపడిన విషయం తెలిసిందే.

➡️