మయాంక్‌ మాయ

Apr 3,2024 08:00
  • బెంగళూరుపై 28పరుగుల తేడాతో నెగ్గిన లక్నో
  • డికాక్‌ అర్ధసెంచరీ

బెంగళూరు : చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య బెంగళూరు జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. ఇంతకుముందు మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో 7వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు జట్టు మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో 28పరుగుల తేడాతో ఓడింది. తొలుత లక్నో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(81) అర్ధసెంచరీకి తోడు చివర్లో నికోలస్‌ పూరన్‌(40నాటౌట్‌; 20బంతుల్లో ఫోర్‌, 5సిక్సర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. టాప్లే వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో లక్నోకు భారీస్కోర్‌ అందించాడు. దాంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 181పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. తొలుత ఆర్సీబీ బౌలర్లకు లక్నో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(20), డికాక్‌(81)లు చుక్కలు చూపించారు. మ్యాక్స్‌వెల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో రాహుల్‌ను ఔట్‌ చేసి ఆర్సీబీకి బ్రేక్‌ ఇచ్చాడు. మరో ఎండ్‌లో తొలి ఓవర్‌ నుంచి ధాటిగా ఆడుతున్న డికాక్‌ ఐపీఎల్‌లో 22వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యంతో లక్నోను ఆదుకున్నారు. ధాటిగా ఆడుతున్న మార్కస్‌ స్టోయినిస్‌(24)ను మ్యాక్స్‌వెల్‌ ఔట్‌ చేశాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌(6) స్వల్ప స్కోరకే వెనుదిరిగాడు. 20 బంతుల్లో ఐదు సిక్సర్లతో 40 పరుగులు చేసి లక్నోకు భారీ స్కోర్‌ అందించాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో మ్యాక్స్‌వెల్‌కు రెండు, సిరాజ్‌, దయాల్‌, టోప్లీలకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో బెంగళూరు టాపార్డర్‌ బ్యాటర్లు కోహ్లి(22), డుప్లెసిస్‌(19), పటీధర్‌(29) మాత్రమే రాణించగా.. చివర్లో లోమ్రోర్‌(33) ఫర్వాలేదని పించాడు. మిగిలిన బ్యాటర్లంతా నిరాశపరిచారు. దీంతో బెంగళూరు జట్టు 19.4ఓవర్లలో 153పరుగులకే కుప్పకూలింది. లక్నో బౌలర్లు మయాంక్‌కు మూడు, నవీన్‌కు రెండు, సిద్ధార్ధ్‌, యశ్‌, స్టొయినీస్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మయాంక్‌ యాదవ్‌కు లభించింది.

స్కోర్‌బోర్డు..
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి)మయాంక్‌ దగర్‌ (బి)టోప్లీ 81, కెఎల్‌ రాహుల్‌ (సి)మయాంక్‌ దగర్‌ (బి)మ్యాక్స్‌వెల్‌ 20, దేవదత్‌ పడిక్కల్‌ (సి)అనుజ్‌ రావత్‌ (బి)సిరాజ్‌ 6, స్టొయినీస్‌ (సి)మయాంక్‌ దగర్‌ (బి)మ్యాక్స్‌వెల్‌ 24, పూరన్‌ (నాటౌట్‌) 40, ఆయుష్‌ బడోని (సి)డుప్లెసిస్‌ (బి)యశ్‌ దయాల్‌ 0, కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 0, అదనం 10. (20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 181పరుగులు. వికెట్ల పతనం: 1/53, 2/73, 3/129, 4/143, 5/148 బౌలింగ్‌: టోప్లీ 4-0-39-1, యశ్‌ దయాల్‌ 4-0-24-1, సిరాజ్‌ 4-0-47-1, మ్యాక్స్‌వెల్‌ 4-0-23-2, మయాంక్‌ దగర్‌ 2-0-23-0, గ్రీన్‌ 2-0-25-0
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి)పడిక్కల్‌ (బి)సిద్ధార్ధ్‌ 22, డుప్లెసిస్‌ (రనౌట్‌) పడిక్కల్‌ 19, పటీధర్‌ (సి)పడిక్కల్‌ (బి)మయాంక్‌ యాదవ్‌ 29, మ్యాక్స్‌వెల్‌ (సి)పూరన్‌ (బి)మయాంక్‌ యాదవ్‌ 0, గ్రీన్‌ (బి)మయాంక్‌ యాదవ్‌ 9, అనుజ్‌ రావత్‌ (సి)పడిక్కల్‌ (బి)స్టొయినీస్‌ 11, లోమ్రోర్‌ (సి)పూరన్‌ (బి)యశ్‌ ఠాకూర్‌ 33, దినేశ్‌ కార్తీక్‌ (సి)రాహుల్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 4, మయాంక్‌ దగర్‌ (రనౌట్‌)పూరన్‌ 4, టోప్లీ (నాటౌట్‌) 3, సిరాజ్‌ (సి)పూరన్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 12. అదనం 11. (19.4ఓవర్లలో ఆలౌట్‌) 153పరుగులు. వికెట్ల పతనం: 1/40, 2/42, 3/43, 4/58, 5/94, 6/103, 7/136, 8/137, 9/138, 10/153 బౌలింగ్‌: సిద్ధార్ధ్‌ 3-0-21-1, కృనాల్‌ పాండ్య 1-0-10-0, నవీన్‌-ఉల్‌-హక్‌ 3.4-0-25-2, మయాంక్‌ యాదవ్‌ 4-0-14-3, రవి బిష్ణోరు 3-0-33-0, యశ్‌ ఠాకూర్‌ 4-0-38-1, స్టొయినీస్‌ 1-0-9-1.

➡️