మిల్లర్‌కు గాయం.. రెండు వారాలపాటు జట్టుకు దూరం

Apr 5,2024 18:45 #2024 ipl, #Cricket, #Sports

అహ్మదాబాద్‌: గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ గాయం కారణంగా మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడు కోలుకునేందుకు మరో రెండు వారాలు పట్టనుందని సమాచారం. దీంతో ప్రత్యర్థులన వణికించే మిల్లర్‌ గాయపడడం, టోర్నీకి దూరమవ్వడం గురించి శుక్రవారం కేన్‌ విలియమ్సన్‌ వెల్లడించాడు. ‘జట్టు సభ్యులతో మైదానంలోకి దిగడం సంతోషంగా ఉంది. వారానికి పైగా మిల్లర్‌ సేవల్ని కోల్పోవడం బాధాకరం’ అని తెలిపాడు. మిల్లర్‌ వచ్చేంతవరకూ విలియమ్సన్‌ ఆడుతాడని గుజరాత్‌ యాజమాన్యం తెలిపింది. మిడిలార్డర్‌లో సిక్సర్లతో విరుచుకుపడే కిల్లర్‌ మిల్లర్‌ లేకపోవడం గుజరాత్‌కు పెద్ద లోటే. ఈ చిచ్చరపిడుగు జట్టులో లేకపోవడంతో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఓటమిపాలైంది. పదిహేడో సీజన్‌లో సొంత గడ్డపై రెండు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్‌ పంజాబ్‌, చెన్నై చేతుల్లో ఓడింది.

➡️