బార్సిలోనా టోర్నీ బరిలో నాదల్‌..

Apr 13,2024 22:15 #Sports

మాడ్రిడ్‌: 22గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ మళ్లీ రాకెట్‌ పట్టనున్నాడు. గాయం కారణంగా గత రెండేళ్లుగా ప్రధాన టోర్నీలకు దూరంగా ఉంటున్న రఫెల్‌ నాదల్‌ వచ్చే వారం జరిగే ఏటిపి బార్సిలోనా ఓపెన్‌ బరిలో దిగనున్నట్లు శనివారం ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పాల్గన్నా.. ఆ తర్వాత గాయం మళ్లీ తిరగబెట్టడంతో మళ్లీ రాకెట్‌ పట్టలేదు. 38ఏళ్ల నాదల్‌.. రికార్డుస్థాయిలో 15సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్‌ను చేజిక్కించుకొని నయా చరిత్ర లిఖించిన సంగతి తెలిసిందే. త్వరలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రధాన టోర్నీకి ముందు సన్నాహకంగా కోర్టులోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

➡️