నాదల్‌ పునరాగమనం అదుర్స్‌..

Jan 4,2024 22:15 #Sports

బ్రిస్బేన్‌ ఇంటర్నేషన్‌ టెన్నిస్‌ టోర్నీ క్వార్టర్స్‌కు

బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ ఏటిపిా250లో బరిలోకి దిగిన మాజీ నంబర్‌ వన్‌ ఆటగాడు, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. గురువారం జరిగిన పోటీలో నాదల్‌ 6-1, 6-2తో కూబ్లెర్‌ను వరుససెట్లలో చిత్తుచేశాడు. సుమారు 12 నెలలుగా గాయంతో కోర్టు మైదానంలోకి దిగని నాదల్‌.. పునరాగమనం మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌ను నాధల్‌ కేవలం 83 నిమిషాల్లోనే ముగించాడు. త్వరలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రారంభం కానుండగా.. నాదల్‌ ఈ టోర్నమెంట్‌ బరిలోకి రాణించడం ఖాయంగా కనబడుతోంది.

➡️