French Open: మొయిన్‌ డ్రాలో నాగల్‌

Apr 17,2024 20:31 #Sports, #Tennis
  • తొలి ఆటగాడిగా రికార్డు

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నేరుగా మెయిన్‌ డ్రాలో చోటు దక్కించుకున్న తొలి ఆటగానిగా భారత్‌కు చెందిన సుమిత్‌ నాగల్‌ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల జరిగిన మోంటోకార్లో టోర్నమెంట్‌ అర్హత, తొలిరౌండ్‌ పోటీల్లో విజయం సాధించడంతో టాప్‌-80లో చోటు దక్కించుకున్నాడు. 2019లో ప్రజ్ఞేష్‌ గుణ్ణేశ్వరన్‌ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ డ్రాకు చేరిన మరో ఆటగాడు నాగల్‌ మాత్రమే. ఏటిపి-99 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆటగాళ్లకు నేరుగా ప్రధాన టోర్నీలో ఆడే అవకాశం ఉంది. ఇక తుంటిగాయం కారణంగా ఏడాదిగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న 14సార్లు ఫ్రెంచ్‌ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ విజేత, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ తిరిగి బరిలోకి దిగనున్నాడు. అతడు 10వ ర్యాంక్‌తో ఈసారి బరిలోకి దిగనున్నాడు. పురుషుల విభాగంలో నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా), మహిళల విభాగంలో ఇగా స్వైటెక్‌(పోలండ్‌) టాప్‌ర్యాంక్‌ దక్కింది. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ రోలాండ్‌ గారోస్‌లో మే 20నుంచి జూన్‌ 9వరకు జరగనుంది. గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ కరోలినా ముఛోవా గాయం కారణంగా ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి దూరమైంది.

➡️