పంజాబ్‌ భల్లె.. భల్లె..

May 2,2024 08:13 #2024 ipl, #csk, #IPL, #pbks
  • చెన్నైపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
  • గైక్వాడ్‌ అర్ధసెంచరీ

చెన్నై: చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో ఈ మైదానంలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నెగ్గిన చెన్నైకు పంజాబ్‌ కింగ్‌ చెక్‌ పెట్టింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 162పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని పంజాబ్‌ జట్టు 17.5ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి గెలిచింది. ఛేదనలో భాగంగా పంజాబ్‌ బ్యాటర్లు బెయిర్‌స్టో(46), రూసో(43)కి తోడు చివర్లో శశాంక్‌ సింగ్‌(25), కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌(26) బ్యాటింగ్‌లో రాణించారు. ఓపెనర్‌ ప్రభ్‌ సిమ్రన్‌(13) మాత్రమే నిరాశపరిచాడు. అంతకుముందు పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్ల ధాటికి చెన్నై టాపార్డర్‌ బ్యాటర్లు ఔటవ్వగా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(62) ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్‌ స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌ తొలుత చెలరేగినా… గైక్వాడ్‌ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి.. అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అజింక్యా రహానే(29), ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ సమీర్‌ రిజ్వీ(21) బ్యాట్‌ ఝుళిపించారు. టాస్‌ ఓడిన చెన్నైకి ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలుత ఆచితూచి ఆడిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. అజింక్యా రహానేలు ఆతర్వాత బ్యాట్‌ ఝుళిపించడం మొదలుపెట్టారు. దాంతో, పవర్‌ ప్లే(6 ఓవర్లు)లో చెన్నై వికెట్‌ కోల్పోకుండా 55 పరుగులు చేసింది. పవర్‌ ప్లేలో పటిష్ట స్థితిలో నిలిచిన చెన్నైని హర్‌ప్రీత్‌ బ్రార్‌ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో అజింక్యా రహానే, శివం దూబేలను ఔట్‌ చేసి పంజాబ్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(2)ను రాహుల్‌ చాహర్‌ ఎల్బీగా వెనక్కి పంపి చెన్నైను మరింత కష్టాల్లోకి నెట్టాడు. 70 పరుగులకే 4 వికెట్లు పడిన జట్టును సమీర్‌ రిజ్వీ(21)తో కలిసి ఒడ్డున పడేసే ప్రయత్నం చేశాడు. నాలుగో వికెట్‌కు 37 పరుగులు జతచేసిన ఈ జోడీని రబడా విడదీశాడు. రిజ్వీ తర్వాత క్రీజులోకి వచ్చిన మోయిన్‌ అలీ(15)తో గైక్వాడ్‌ వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. పంజాబ్‌ కెప్టెన్‌ సామ్‌ కరన్‌ వేసిన ఓవర్లో తొలి సిక్సర్‌ బాది అర్ధ సెంచరీ సాధించాడు. అలీ సైతం సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే.. 18వ ఓవర్లో అర్ష్‌దీప్‌ సూపర్‌ యార్కర్‌తో గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆ వెంటనే ఎంఎస్‌ ధోనీ(14).. 20వ ఓవర్లో ఒక ఫోర్‌, సిక్సర్‌ బాది స్కోర్‌ 160 పరుగులు దాటించాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల 7నష్టానికి 162పరుగులు చేసింది. ధోనీ చివరి బంతికి రనౌటయ్యాడు. పంజాబ్‌ బౌలర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌, చాహర్‌లకు రెండేసి, ఆర్ష్‌దీప్‌, రబడాకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు..
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: అజింక్యా రహానే (సి)రూసో (బి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ 29, గైక్వాడ్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 62, దూబే (ఎల్‌బి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ 0, జడేజా (ఎల్‌బి)రాహుల్‌ చాహర్‌ 2, సమీర్‌ రిజ్వి (సి)హర్షల్‌ పటేల్‌ (బి)రబడా 21, మొయిన్‌ అలీ (బి)రాహుల్‌ చాహర్‌ 15, ధోనీ (రనౌట్‌) హర్షల్‌ పటేల్‌/జితేశ్‌ శర్మ 14, మిఛెల్‌ (నాటౌట్‌) 1, అదనం 18. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి)

వికెట్ల పతనం: 1/64, 2/65, 3/70, 4/107, 5/145, 6/147, 7/162

బౌలింగ్‌: రబడా 4-0-23-1, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-52-1, కర్రన్‌ 3-0-37-0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-17-2, రాహుల్‌ చాహర్‌ 4-0-16-2, హర్షల్‌ పటేల్‌ 1-0-12-0

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సిమ్రన్‌ సింగ్‌ (సి)రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి)రిచర్డు 13, బెయిర్‌స్టో (సి)ధోనీ (బి)దూబే 46, రూసో (బి)శార్దూల్‌ 43, శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 25, సామ్‌ కర్రన్‌ (నాటౌట్‌) 26, అదనం 10, (17.5ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 163పరుగులు.

వికెట్ల పతనం: 1/19, 2/83, 3/113
దీపక్‌ చాహర్‌ 0.2-0-4-0, శార్దూల్‌ 3.4-0-48-1, రిచర్డు 3.5-0-30-1, ముస్తాఫిజుర్‌ 4-1-22-0, జడేజా 3-0-22-0, మొయిన్‌ అలీ 2-0-22-0, దూబే 1-0-14-1.

➡️