కోహ్లికి ప్రత్యామ్నాయంగా రజత్‌ పాటిదార్‌ ఎంపిక

Jan 24,2024 11:50 #Cricket, #Sports, #test

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లికి రీప్లేస్‌మెంట్‌గా రజత్‌ పాటిదార్‌ ఎంపికయ్యాడు. సీనియర్లైన పుజారా, రహానే, యువ ఆటగాళ్లు సర్ఫరాజ్‌ ఖాన్‌, రియాన్‌ పరాగ్‌ల నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. అంతిమంగా సెలెక్టర్లు ఈ మధ్యప్రదేశ్‌ ఆటగాడివైపే మొగ్గు చూపారు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభంకానుంది. తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. అందులో పాటిదార్‌కు చోటు దక్కలేదు. కొద్ది రోజుల కిందట కోహ్లి తొలి రెండు టెస్ట్‌లకు అందుబాటులో ఉండడని తెలియడంతో సెలెక్టర్లు పాటిదార్‌ను అతని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు.
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌కీపర్‌), ధృవ్‌ జురెల్‌ (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, రజత్‌ పాటిదార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌

➡️