T20 World Cup : అదరగొట్టిన టీమిండియా

  • సూర్యకుమార్‌ అర్ధసెంచరీ
  • బుమ్రా కెరీర్‌బెస్ట్‌ బౌలింగ్‌
  • ఆర్ష్‌దీప్‌కు మూడు వికెట్లు
  • ఆఫ్ఘనిస్తాన్‌పై 47పరుగుల తేడాతో ఘన విజయం

బార్బొడాస్‌: టి20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో టీమిండియా జూలు విదిలించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో గురువారం జరిగిన సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 47పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత మిస్టర్‌ 360డిగ్రీస్‌ అర్ధసెంచరీతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 134పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా(3/7) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌కి తోడు ఆర్ష్‌దీప్‌ సింగ్‌(3/36) రాణించారు.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(8) మరోసారి నిరాశపరిచాడు. మరో ఎండ్‌లో కోహిల(24) ఆచి తూచి ఆడాడు. పంత్‌(20) మరోవైపు బ్యాట్‌ ఝుళిపిస్తున్నా.. కోహ్లి భారీషాట్స్‌కు ప్రయత్నించలేదు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌(53) అర్ధసెంచరీతో చెలరేగాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా(32) సహకారంతో సూర్యకుమార్‌ యాదవ్‌ 28బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లతో చెలరేగాడు. హార్దిక్‌ పాండ్యా 24బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్‌ పటేల్‌(12; 6బంతుల్లో 2ఫోర్లు) రాణించడంతో టీమిండియా భారీస్కోర్‌ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌, ఫజల్‌-హక్‌-ఫరూఖీలకు మూడేసి, నవీనుల్‌ హక్‌కు ఒక వికెట్‌ దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ను టీమిండియా బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా తొలుతే కట్టడి చేశాడు. గుర్బాజ్‌(11), జజారు(2)లను ఔట్‌ చేశాడు. ఇబ్రహీం జడ్రాన్‌(8)ను అక్షర్‌ ఔట్‌ చేయడంతో ఆఫ్ఘన్‌ జట్టు 23పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లనూ టీమిండియా బౌలర్లు కట్టడి చేయగా.. ఒమర్జారు(26) ఫర్వాలేదనిపించాడు. ఆఫ్ఘన్‌ బ్యాటర్‌ ఏ ఒక్కరూ క్రీజ్‌లో నిలదొక్కుకొనే అవకాశం టీమిండియా బౌలర్లు ఇవ్వలేదు. ఆర్ష్‌దీప్‌, బుమ్రాకు మూడేసి, కుల్దీప్‌కు రెండు, అక్షర్‌, జడేజాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు లభించింది.

స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి)రషీద్‌ ఖాన్‌ (బి)ఫారూఖీ 8, కోహ్లి (సి)నబి (బి)రషీద్‌ ఖాన్‌ 24, పంత్‌ (ఎల్‌బి)రషీద్‌ ఖాన్‌ 20, సూర్యకుమార్‌ (సి)నబి (బి)ఫారూఖీ 53, దూబే (ఎల్‌బి)రషీద్‌ ఖాన్‌ 10, హార్దిక్‌ (సి)అజ్మతుల్లా (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 32, జడేజా (సి)గుల్బద్దీన్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 12, అక్షర్‌ పటేల్‌ (రనౌట్‌) గుర్బాజ్‌/నవీన్‌-ఉల్‌-హక్‌ 12, ఆర్ష్‌్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 2, అదనం 13. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 181పరుగులు. వికెట్ల పతనం: 1/11, 2/54, 3/62, 4/90, 5/150, 6/159, 7/165, 8/181 బౌలింగ్‌: ఫారూఖీ 4-0-33-3, మహ్మద్‌ నబీ 3-0-24-0, నవీన్‌ 4-0-40-1, రషీద్‌ 4-0-26-3, నూర్‌ అహ్మద్‌ 3-0-30-0, అజ్మతుల్లా 2-0-23-0

ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)పంత్‌ (బి)బుమ్రా 11, హజ్మతుల్లా (సి)జడేజా (బి)బుమ్రా 2, ఇబ్రహీం జడ్రాన్‌ (సి)రోహిత్‌ (బి)అక్షర్‌ 8, గులాబుద్దిన్‌ నబి (సి)పంత్‌ (బి)కుల్దీప్‌ 17, ఒమర్జారు (సి)అక్షర్‌ (బి)జడేజా 26, నజీబుల్లా (సి)ఆర్ష్‌దీప్‌ (బి)బుమ్రా 19, మహ్మద్‌ నబి (సి)జడేజా (బి)కుల్దీప్‌ 14, రషీద్‌ ఖాన్‌ (సి)జడేజా (బి)ఆర్ష్‌దీప్‌ 2, నూర్‌ అహ్మద్‌ (సి)రోహిత్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 12, నవీన్‌ (సి)పంత్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 0, ఫారూఖీ (నాటౌట్‌) 4, అదనం 19. (20ఓవర్లలో ఆలౌట్‌) 134పరుగులు.

వికెట్ల పతనం: 1/13, 2/23, 3/23, 4/67, 5/71, 6/102, 7/114, 8/121, 9/121, 10/134

బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 4-0-36-3, బుమ్రా 4-1-7-3, అక్షర్‌ 3-1-15-1, హార్దిక్‌ 2-0-13-0, కుల్దీప్‌ 4-032-2, జడేజా 3-0-20-1.

➡️