రోహిత్‌, కోహ్లీ రీఎంట్రీ

Jan 8,2024 11:02 #Sports
  • ఆఫ్గనిస్తాన్‌తో టి20 సిరీస్‌
  • భారత జట్టు ప్రకటన

ముంబయి : ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కోసం భారత జట్టును ఆదివారం ప్రకటించారు. సుమారు 14 నెలల తర్వాత రోహిత్‌, విరాట్‌ పొట్టి ఫార్మాట్‌లోకి (అంతర్జాతీయ క్రికెట్‌) రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ వ్యవహరించనున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాపై సెంచరీ (వన్డేలో) చేసిన సంజూ శాంసన్‌కు టి20 జట్టులో చోటు లభించింది. బుమ్రా, సిరాజ్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. గాయాలు కారణంగా రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టుకు దూరమయ్యారు. వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా గాయపడిన హార్దిక్‌ ఇంకా కోలుకోలేదని సెలెక్టర్లు చెప్పారు. రవీంద్ర జడేజా, కెఎల్‌ రాహుల్‌కు సెలెక్టర్లు రెస్ట్‌ ఇచ్చారు. ఈ సిరీస్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆ జట్టుకు సారధిగా ఇబ్రహీం జడ్రాన్‌ వ్యవహరించనున్నాడు. ఇటీవలే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్‌ ఖాన్‌ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్లు ఆదివారం భారత్‌కు చేరుకున్నారు.

టీమిండియా : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభమన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోరు, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌, ముఖేష్‌ కుమార్‌

అఫ్గనిస్తాన్‌ : ఇబ్రహీం జడ్రాన్‌ (కెప్టెన్‌), రహ్మతుల్లా గుర్బాజ్‌ (వికెట్‌ కీపర్‌), ఇక్రమ్‌ అలీఖిల్‌ (వికెట్‌ కీపర్‌), హజ్రతుల్లా జజారు, రహ్మత్‌ షా, నజీబుల్లా జడ్రాన్‌, మహ్మద్‌ నబీ, కరీం జనత్‌, అజ్మతుల్లా ఒమర్జారు, షరాఫుద్దీన్‌ అష్రఫ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, ఫరీద్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ సలీం, కైస్‌ అహ్మద్‌, గుల్బడిన్‌ నైబ్‌, రషీద్‌ ఖాన్‌

➡️