దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

Dec 18,2023 08:10 #Cricket, #India, #South Africa
sa india oneday cricket

జొహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికాపై భారత బౌలర్లు విజృంభించి 116 పరుగులకే ఆలౌటై చేశారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సాయి సుదర్శన్(55నాటౌట్), లయర్(52) చెలరేగి ఆడి అర్ధ సెంచరీలు చేశారు. జొహానెస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్ (5/37), అవేశ్ ఖాన్‌ (4/27) నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటర్ల కుప్పకుల్చారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండిలే ఫెలుక్వాయో (33; 49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. వారిలో ఇద్దరే రెండంకెల స్కోర్ చేశారు. దక్షిణాఫ్రికా మొదటి నుండి వికెట్లు కోల్పోతూ వచ్చింది. అర్ష్‌దీప్‌ సింగ్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి రీజా హెండ్రిక్స్‌ (0) బౌల్డ్‌ కాగా.. ఆ మరుసటి బంతికే రస్సీ వాండర్‌ డసెన్‌ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. అర్ష్‌దీప్‌ సింగ్ దూకుడుకు అవేశ్‌ ఖాన్‌ తోడవ్వడంతో 116 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటై అయింది.

➡️