ఓటమి అంచుల్లో బంగ్లాదేశ్‌ – శ్రీలంకతో రెండోటెస్ట్‌

Apr 2,2024 23:50 #Sports

ఢాకా: శ్రీలంకతో జరుగుతున్న రెండో, చివరి టెస్ట్‌లోనూ ఆతిథ్య బంగ్లాదేశ్‌ జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. 511పరుగుల భారీ ఛేదనలో భాగంగా మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ జట్టు ఆట ముగిసే సమయానికి 7వికెట్ల నష్టానికి 268పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు మరో 243పరుగులు చేయాల్సి ఉండగా.. మరో మూడు వికెట్లు పడగొడితే శ్రీలంకకు విజయం దక్కనుంది. శ్రీలంక బౌలర్లు పేసర్‌ లాహిరు కుమార, స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య, పార్ట్‌టైమ్‌ బౌలర్‌ కమిందు మెండీస్‌ రెండేసి వికెట్లతో రాణించారు.

➡️