శార్దుల్‌ శతక జోరు

Mar 4,2024 10:21 #Cricket, #Ranji Trophy, #Sports
  • ముంబయి తొలి ఇన్నింగ్స్‌ 353/9

ముంబయి : తమిళనాడు, ముంబయి రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ (109, 105 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ సెంచరీతో చెలరేగాడు. టెయిలెండర్‌ తనుశ్‌ కొటియన్‌ (74 నాటౌట్‌, 109 బంతుల్లో 10 ఫోర్లు), హార్దిక్‌ తామోరె (35, 92 బంతుల్లో 3 ఫోర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌లతో రాణించారు. టాప్‌ ఆర్డర్‌లో యువ ఆటగాడు ముషీర్‌ ఖాన్‌ (55, 131 బంతుల్లో 6 ఫోర్లు) మినహా పృథ్వీ షా (5), బూపెన్‌ లాల్వాని (15), మోమిత్‌ అవస్తి (2), అజింక్య రహానె (19), శ్రేయస్‌ అయ్యర్‌ (3), శామ్స్‌ ములాని (0) విఫలమయ్యారు. దీంతో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో హార్దిక్‌, తనుశ్‌ తోడుగా శార్దుల్‌ రెండు కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. ఠాకూర్‌ సెంచరీ ఇన్నింగ్స్‌తో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 353/9 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 207 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తమిళనాడు బౌలర్‌ సాయికిశోర్‌ (6/97) ఆరు వికెట్లతో చెలరేగాడు. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.

➡️