క్వార్టర్స్‌కు సింధు, అస్మిత

May 23,2024 22:55 #Sports

మలేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
కౌలాలంపూర్‌: మలేషియా మాస్టర్స్‌ సూపర్‌500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి పివి సింధు, సంచలనాల అస్మిత చాలీహా ప్రవేశించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్న పివి సింధు గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో 21-13, 12-21, 21-14తో మాజీ ఛాంపియన్‌ సిమ్‌-యుాజిన్‌(కొరియా)ను చిత్తుచేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సిమ్‌ 34వ ర్యాంక్‌ క్రీడాకారిణి. ఇక యువ సంచలనం అస్మిత చాలీహా ఏకంగా 3వ సీడ్‌ బివెన్‌ జంగ్‌(అమెరికా)ను ఓడించి పెను సంచలనాన్ని నమోదు చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 53వ స్థానంలో ఉన్న 24ఏళ్ల అస్మిత హోరాహోరీ పోరులో 21-19, 16-21, 21-12తో బివెన్‌ జంగ్‌ను ఓడించింది. సూపర్‌500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో అస్మిత క్వార్టర్స్‌కు చేరడం ఇది రెండోసారి. క్వార్టర్‌ఫైనల్లో అస్మిత 16వ ర్యాంక్‌ క్రీడాకారిణి, చైనాకు చెందిన జెంగ్‌-హిామన్‌తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిరణ్‌ జార్జి 13-21, 18-21తో 5వ సీడ్‌ జి-జియా(చైనా) చేతిలో, మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్‌ జంట 18-21, 22-20, 14-21తో కొరియా జంట చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బి.సుమిత్‌రెడ్డి-సిక్కిరెడ్డి జంట 9-21, 15-21తో టాప్‌సీడ్‌, మలేషియాకు చెందిన చెన్‌-టాంగ్‌, టో-ఇ-వుయ్ చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూశారు. మరో పోటీలో సిమ్రన్‌ సింఘ్వీారితికా ఠక్కర్‌ జంట 17-21, 11-21తో 2వ సీడ్‌ మలేషియా జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.

➡️