సెమీస్‌కు సిన్నర్‌, సిట్సిపాస్‌

Apr 12,2024 23:03 #Sports

మోంటేకార్లో మాస్టర్స్‌ టోర్నీ
మొనాకో: మోంటేకార్లో మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి 2వ సీడ్‌ జెన్నిక్‌ సిన్నర్‌, 12వ సీడ్‌ సిట్సిపాస్‌ ప్రవేశించారు. శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్‌ఫైనల్లో స్టెఫోనిస్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) 6-4, 6-2తో వరుససెట్లలో 15వ సీడ్‌ ఖచనోవ్‌(రష్యా)ను ఓడించాడు. మరో క్వార్టర్స్‌లో 2వ సీడ్‌ జెన్నిక్‌ సిన్నర్‌(పోలండ్‌) 6-4, 6-7(6-8), 6-3తో 7వ సీడ్‌ రూనే(డెన్మార్క్‌)ను ఓడించాడు. శనివారం జరిగే సెమీస్‌లో సిన్నర్‌తో సిట్సిపాస్‌ తలపడనున్నాడు. ఇతర క్వార్టర్స్‌ పోటీలో 12వ సీడ్‌ హోబర్ట్‌ హుర్క్‌రాజ్‌తో 8వ సీడ్‌ సి. రూఢ్‌, టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌తో 11వ సీడ్‌ డిామినార్‌ తలపడనున్నారు.

➡️