దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌.. షమీ, దీపక్‌ దూరం : బీసీసీఐ

Dec 16,2023 12:01 #Cricket, #Sports

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు పేసర్‌ మహమ్మద్‌ షమీ ఫిట్‌నెస్‌ కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా శనివారం దవీకరించింది. షమీ ఫిట్‌నెస్‌పై మెడికల్‌ టీమ్‌ ఇంకా క్లియర్స్‌ ఇవ్వలేదని, అందువల్ల షమీ దక్షిణాఫ్రికు వెల్లడం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అతడు తిరిగి వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో బెంగాల్‌ పేసర్‌ ఆకాష్‌ దీప్‌తో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. దీపక్‌ చాహర్‌ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రిని దగ్గరుండి చాహర్‌ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు వన్డే సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.

➡️