టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నదక్షిణాఫ్రికా

Dec 19,2023 16:44 #Sports
  • టీమిండియాతో రెండో వన్డే… రింకూ సింగ్‌ అరంగేట్రం

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల ఈ సిరీస్‌ లో తొలి మ్యాచ్‌ లో టీమిండియా ఘనవిజయం సాధించడం తెలిసిందే. కెబెరాలోని సెయింట్‌ జార్జ్‌ పార్క్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. శ్రేయాస్‌ అయ్యర్‌ టెస్టు జట్టులోకి వెళ్లడంతో అతడి స్థానంలో టీమిండియాలో రింకూ సింగ్‌ ను తీసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో ఈ మ్యాచ్‌ కోసం రెండు మార్పులు జరిగాయి. బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, లిజాద్‌ విలియమ్స్‌ జట్టులోకి వచ్చారు.

తుది జట్లు:

భారత్‌: సాయి సుదర్శన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌, ముఖేష్‌ కుమార్‌

దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్‌, రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌), డేవిడ్‌ మిల్లర్‌, వియాన్‌ ముల్డర్‌, కేశవ్‌ మహరాజ్‌, నండ్రే బర్గర్‌, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, లిజాడ్‌ విలియమ్స్‌

➡️