సౌత్‌ జోన్‌ టెన్నిస్‌ టోర్నీ ఛాంపియన్‌ ఎస్‌ఆర్‌ఎమ్‌ వర్సిటీ

Dec 31,2023 22:30 #Sports

– రన్నరప్‌గా ఆంధ్ర వర్శిటీ

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌ (విజయవాడ):కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలోని టెన్నిస్‌ అకాడమీలో జరుగుతున్న దక్షిణ మండల అంతర విశ్వ విద్యాలయాల టెన్నిస్‌ పురుషుల ఛాంపియన్‌గా ఎస్‌ఆర్‌ఎమ్‌ విశ్వవిద్యాలయం నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయంపై 3-0 తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకుంది. రన్నరప్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలవగా మూడు, నాలుగు స్థానాల్లో భారతీయార్‌ విశ్వవిద్యాలయం, కెఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం జట్లు నిలిచాయి. నాలుగు జట్లు అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల టెన్నిస్‌ పురుషుల టోర్నీకి అర్హత సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కృష్ణా వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.జ్ఞానమణి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్‌ ఇండియా స్థాయిలో మంచి ప్రతిభ చూపి విశ్వవిద్యాలయాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ పి.వీర బ్రహ్మచారి, కఅష్ణా వర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ నవీన్‌ లావణ్య లత, ఆంధ్ర లయోల కళాశాల ప్రిన్సిపల్‌ జి.ఎ.పి.కిషోర్‌, టోర్నీ కన్వీనర్‌ డాక్టర్‌ జె.వి.నాగేంద్రప్రసాద్‌, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఇ.త్రిమూర్తి, అకాడమిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

➡️