టీ20 విజేత సీఎఫ్‌సీ

Apr 14,2024 23:30 #Sports

హైదరాబాద్‌: నెక్ట్స్‌ జెన్‌ ఉమెన్స్‌ టీ20 ట్రోఫీని సెంటర్‌ ఫర్‌ క్రికెట్‌ (సీఎఫ్‌సీ) ఎక్స్‌లెన్స్‌ అకాడమీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కోచింగ్‌ బియాండ్‌పై సీఎఫ్‌సీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కోచింగ్‌ బియాండ్‌ (సీబీ) 20 ఓవర్లలో 121కు ఆలౌటైంది. ఛేదనలో సీఎఫ్‌సీ టీమ్‌ 15.5 ఓవర్లలో 122/1 పరుగులు చేసింది. ఓపెనర్‌ రమ్య (72), ఆల్‌రౌండర్‌ జి.త్రిషా రెడ్డి (3/18, (44) రాణించారు. 310 పరుగులు, 11 వికెట్లు తీసిన త్రిష టోర్నీ అత్యంత విలువైన ప్లేయర్‌గా నిలిచింది. సీఎఫ్‌సీ జట్టును కోచ్‌లు జగదీశ్‌ రెడ్డి, షానవాజ్‌ అభినందించారు.

➡️