T20 World Cup: ఇక సూపర్‌-8 సమరం

Jun 18,2024 08:26 #2024 t20 world cup, #Cricket, #Sports
  • అమెరికా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో ప్రారంభం

గయానా: ఐసిసి టి20 ప్రపంచకప్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సూపర్‌-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. 20జట్లతో ఈసారి ప్రారంభమైన మెగా టోర్నీలో లీగ్‌ దశలోనే బలమైన మూడుజట్లు నిష్క్రమించాయి. గ్రూప్‌-ఎ నుంచి పాకిస్తాన్‌, సి నుంచి న్యూజిలాండ్‌, డి నుంచి శ్రీలంక జట్లు సూపర్‌-8కు చేరడంలో విఫలమయ్యాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టు గ్రూప్‌-బి నుంచి చివరి మ్యాచ్‌లో నమీబియాపై గెలిచి సూపర్‌-8కు చేరగా.. స్కాట్లాండ్‌ రన్‌రేట్‌ ప్రాతిపదికపై సూపర్‌-8కు చేరడంలో విఫలమైంది. గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ జట్లు 5పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. శ్రీలంక జట్టు 2014 ఛాంపియన్‌ కాగా.. పాకిస్తాన్‌ 2009 ఛాంపియన్‌. ఈ రెండు జట్లు ఈసారి లీగ్‌ దశలోనే నిష్క్రమించడం అభిమానులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది.

చిన్న జట్ల హవా…
టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లలో ఆతిథ్య అమెరికా జట్టు పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఈ జట్టు మెగా టోర్నీకి అర్హత సాధించడమే గొప్ప అనుకుంటే.. ఏకంగా పాకిస్తాన్‌ వంటి దిగ్గజ జట్టును తొలి మ్యాచ్‌లోనూ ఓడించి సంచలనాన్ని తెరలేపింది. ఇక గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌గా ఉన్న గ్రూప్‌-సిలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు అంచనాలకు మించి రాణించింది. 2019 వన్డే ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ను ఓడించి సూపర్‌-8 బెర్త్‌ దక్కించుకొంది. అదే క్రమంలో ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి టాపర్‌గా సూపర్‌-8కు చేరడం చెప్పుకోగదగ్గ విషయం. ఆతిథ్య వెస్టిండీస్‌ జట్టు 2వ స్థానంలో నిలిచి సూపర్‌-8కు చేరినా.. న్యూజిలాండ్‌ జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఇక గ్రూప్‌-డిలో శ్రీలంక జట్టును బంగ్లాదేశ్‌ ఓడించింది. ఈ ఫలితం శ్రీలంకకు శరాఘాతంగా తయారైంది. దీంతో ఆ జట్టు లీగ్‌దశను దాటలేకపోయింది. ఈ టోర్నీలో ముందుకు వెళ్లలేకపోయినా పాపువా న్యూగినీ, నేపాల్‌ జట్లు కూడా తక్కువేం కాదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టు చేతిలో నేపాల్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడి తన సత్తా ఏంటో చాటింది. మున్ముందు టోర్నీల్లో ఈ కూనలతో పెద్ద జట్లు జాగ్రత్తగా ఉండక తప్పదు అని ఈ టీ20 ప్రపంచకప్‌ ద్వారా నిరూపితమైంది.

కివీస్‌ అనూహ్యంగా..
ప్రపంచకప్‌లో ఎంతో బలమైన రికార్డు ఉన్న కివీస్‌ స్థాయికి తగ్గ ప్రదర్ళనే చేయలేదు. టోర్నీ ఏదైనా కనీసం నాకౌట్‌కు వెళ్లే న్యూజిలాండ్‌ ఈసారి ఆ స్థాయి ప్రదర్శనను కనబర్చలేదు. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ ఇందుకు ఉదాహరణ. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండి కూడా బలహీనమైన అఫ్గాన్‌ చేతిలో కివీస్‌ 75 పరుగులకే ఆలౌటైంది. ఈ టోర్నీలోనే పెద్ద సంచలనం ఇదే. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే తగిలిన ఈ దెబ్బ న్యూజిలాండ్‌ను కోలుకోనీయకుండా చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ చేతిలోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు.

గ్రూప్‌లు..
గ్రూప్‌-1 : ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌
గ్రూప్‌-బి : అమెరికా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌

సూపర్‌-8 షెడ్యూల్‌…

➡️