Team India 2024-25లో బిజి.. బిజీ…

Jun 20,2024 18:34 #Cricket, #Sports, #Team India
  • సొంతగడ్డపై టీమిండియా షెడ్యూల్‌ ఇదే!
  • ఉప్పల్‌లో ఒక టి20

ముంబయి: 2024-25 సీజన్‌లో టీమిండియా సొంతగడ్డపై ఆడే సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ బోర్డు(బిసిసిఐ) వెల్లడించింది. సెప్టెంబర్‌ 19తో ఈ ఏడాది సీజన్‌ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో తొలుత బంగ్లాదేశ్‌తో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా టెస్టు సిరీస్‌ ఆడనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌ జరగనుంది. అక్టోబర్‌ 12న జరిగే భారత్‌, బంగ్లా ఆఖరి టి20కి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదిక కానుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 15 వరకూ జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కివీస్‌ తలపడనుంది. ఈ సిరీస్‌ ముగియగానే ఇంగ్లండ్‌ జట్టు టి20, వన్డే సిరీస్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టనుంది. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకూ జరిగే ఈ రెండు ఫార్మాట్ల సిరీస్‌లో టీమిండియాజట్టు ఇంగ్లండ్‌ జట్టుతో తలపడనుంది.

బంగ్లాదేశ్‌ సిరీస్‌…
తొలి టెస్టు : సెప్టెంబర్‌ 19 – 24(చెన్నై)
రెండో టెస్టు : సెప్టెంబర్‌ 27 – అక్టోబర్‌ 1(ముంబయి)
టి20 సిరీస్‌..
తొలి టి20 : అక్టోబర్‌ 6 (ధర్మశాల)
రెండో టి20 : అక్టోబర్‌ 9 (ఢిల్లీ)
మూడో టి20 : అక్టోబర్‌ 12 (హైదరాబాద్‌)

న్యూజిలాండ్‌ సిరీస్‌..
టెస్టు సిరీస్‌
తొలి టెస్టు : అక్టోబర్‌ 16 – 20(బెంగళూరు)
రెండో టెస్టు : అక్టోబర్‌ 24 – 28 (పుణే)
మూడో టెస్టు : నవంబర్‌ 1 – 5 (ముంబయి)

ఇంగ్లండ్‌తో సిరీస్‌..
టి20 సిరీస్‌..
తొలి టి20 : జనవరి 22(చెన్నై)
రెండో టి20 : జనవరి 25(కోల్‌కతా)
మూడో టి20 : జనవరి 28(రాజ్‌కోట్‌)
నాల్గో టి20 : జనవరి 31(పుణే
ఐదో టి20 : ఫిబ్రవరి 2(ముంబయి)
వన్డే సిరీస్‌..
తొలి వన్డే : ఫిబ్రవరి 6(నాగ్‌పూర్‌)
రెండో వన్డే : ఫిబ్రవరి 9(కటక్‌)
మూడో వన్డే : అక్టోబర్‌ 12(అహ్మదాబాద్‌)

➡️