సూపర్‌ 6లోనూ అదే జోరు

Jan 30,2024 22:30 #Cricket, #Sports
  • న్యూజిలాండ్‌పై 214పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
  • ఐసిసి(అండర్‌ 19) వన్డే ప్రపంచకప్‌

జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి(అండర్‌ 19) వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా యువ క్రికెటర్లు దూసుకెళ్తున్నారు. లీగ్‌దశలో అపజయమెరుగని యువజట్టు సూపర్‌ా6లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. మంగళవారం జరిగినసూపర్‌ 6 తొలి మ్యాచ్‌లో ఏకంగా 214పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ యువ జట్టును చిత్తుచేసింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 295పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. అనంతరం భారత బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్‌ జట్టు 81 పరుగులకే కుప్పకూలింది. తొలుత టీమిండియా ఓపెనర్‌ కులకర్ణి(9) నిరాశపరిచినా.. మరో ఓపెనర్‌ ఆదర్ష్‌ సింగ్‌(52) అర్ధసెంచరీతో రాణించాడు. ముషీర్‌ ఖాన్‌(131) సెంచరీకి తోడు కెప్టెన్‌ ఉదరు సహరన్‌(34) బ్యాటింగ్‌లో మెరిసారు. ముఖ్యంగా ముషీర్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ సాయంతో స్కోర్‌బోర్డును పరుగెత్తించాడు. ముషీర్‌ ఖాన్‌ 109బంతుల్లో 10ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో సెంచరీని పూర్తిచేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు ముషీర్‌ ఖాన్‌ సోదరుడు సర్ఫరాజ్‌ ఖాన్‌ భారత సీనియర్‌ జట్టుకు ఎంపికైన మరుసటి రోజే ముషీర్‌ ఖాన్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించడం మరో విశేషం. ఈ ప్రపంచకప్‌లో ముషీర్‌ ఖాన్‌కు ఇది రెండో సెంచరీ. న్యూజిలాండ్‌ బౌలర్లు మాన్సన్‌ క్లార్క్‌కు నాలుగు, రియాన్‌, ఎడ్వర్డ్‌, కమింగ్‌, తెవాటియాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో న్యూజిలాండ్‌ను తొలినుంచే భారత బౌలర్లు కట్టడి చేశారు. నెల్సన్‌(10), జాక్సన్‌(19), కమింగ్‌(16), థామ్సన్‌(12) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగా… సౌమీ పాండేకు నాలుగు, రాజ్‌ లింబని, ముషీర్‌ ఖాన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ముషీర్‌ఖాన్‌కు లభించగా.. ఫిబ్రవరి 2న జరిగే సూపర్‌ా6 చివరి గ్రూప్‌ మ్యాచ్‌ పసికూన నేపాల్‌తో తలపడనుంది. నేడు జరిగిన ఇతర సూపర్‌ా6 పోటీల్లో వెస్టిండీస్‌ జట్టు శ్రీలంకను, పాకిస్తాన్‌ జట్టు ఐర్లాండ్‌ను చిత్తుచేశాయి.

స్కోర్‌బోర్డు..

ఇండియా(అండర్‌19) ఇన్నింగ్స్‌: ఆదర్ష్‌ సింగ్‌ (సి)ఓలీవర్‌ తెవాటియా (బి)కమింగ్‌ 52, కులకర్ణి (సి)ఎడ్వర్డ్‌ (బి)క్లార్క్‌ 9, ముషీర్‌ ఖాన్‌ (సి)కమింగ్స్‌ (బి)క్లార్క్‌ 131, ఉదయ్ సహరన్‌ (సి)కమింగ్స్‌ (బి)ఓలీవర్‌ తెవాటియా 17, ప్రియాన్షు మోలియా (సి)జోన్స్‌ (బి)క్లార్క్‌ 10, సచిన్‌ ధాస్‌ (సి)స్నేహిత్‌ రెడ్డి (బి)ఎడ్వర్డ్‌ 15, అభిషేక్‌ (బి)క్లార్క్‌ 4, నమన్‌ తివారి (నాటౌట్‌) 3, రాజ్‌ లింబని (నాటౌట్‌) 2, అదనం 18. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 295పరుగులు.

వికెట్ల పతనం: 1/28, 2/105, 3/192, 4/219, 5/257, 6/275, 7/289, 8/289

బౌలింగ్‌: క్లార్క్‌ 8-0-62-4, రియన్‌ సర్జన్‌ 6-0-28-1, ఎడ్వర్డ్‌ 8-0-50-1, ఆస్కార్‌ జాన్సన్‌ 2-0-20-0, కమింగ్స్‌ 10-0-37-1, స్నేహిత్‌ 10-0-48-0, ఓలీవర్‌ తెవాటియా 6-0-43-1.

న్యూజిలాండ్‌(అండర్‌19) ఇన్నింగ్స్‌: టామ్‌ జోన్స్‌ (బి)రాజ్‌ లింబని 0, జేమ్స్‌ నెల్సన్‌(ఎల్‌బి)సౌమీ పాండే 10, స్నేహిత్‌ రెడ్డి (ఎల్‌బి)రాజ్‌ లింబని 0, లఛలన్‌ (బి)సౌమీ పాండే 5, జాక్సన్‌ (బి)ముషీర్‌ ఖాన్‌ 19, ఓలీవర్‌ తెవాటియా (బి)నమన్‌ తివారి 7, కమింగ్స్‌ (ఎల్‌బి)సౌమీ పాండే 16, థామ్సన్‌ (సి)అవనీశ్‌ (బి)కులకర్ణి 12, ఎడ్వర్డ్‌ (బి)ముషీర్‌ ఖాన్‌ 7, పోర్గాస్‌ (స్టంప్‌) అవనీశ్‌ (బి)సౌమీ పాండే 0, క్లార్క్‌ (నాటౌట్‌) 0, అదనం 5. (26.1ఓవర్లలో ఆలౌట్‌) 81పరుగులు.

వికెట్ల పతనం: 1/0, 2/0, 3/13, 4/22, 5/39, 6/55, 7/69, 8/75, 9/76, 10/81

బౌలింగ్‌: రాజ్‌ లింబని 6-2-17-2, సౌమీ పాండే 10-2-19-4, నమన్‌ తివారి 5-0-19-1, ముషీర్‌ ఖాన్‌ 3.1-0-10-2, అర్షిన్‌ కులకర్ణి 4-0-13-1.

➡️