కుర్రాళ్లు కుమ్మేశారు..!

Jan 21,2024 10:09 #Sports
  • ఆదుకున్న ఆదర్ష్‌, ఉదయ్
  • బంగ్లాదేశ్‌పై 84పరుగుల తేడాతో గెలుపు
  • అండర్‌19 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ

జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి అండర్‌19 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సత్తా చాటింది. శనివారం జరిగిన గ్రూప్‌-ఎ భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత యువ క్రికెటర్లు నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 251పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్‌ జట్టు 45.5 ఓవర్లలో 167పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సౌమీ పాండేకు నాలుగు, ముషీర్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత యువ క్రికెటర్లు బ్యాటింగ్‌లో తడబడ్డారు. బంగ్లా బౌలర్ల ధాటికి భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (76; 96 బంతుల్లో 6ఫోర్లు), కెప్టెన్‌ ఉదరు సహరన్‌ (64; 94బంతుల్లో, 4ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. వన్‌ డౌన్‌లో వచ్చిన ముషీర్‌ ఖాన్‌(3) విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఆదర్శ్‌-ఉదయ్ లు మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్‌కు చౌదరి రిజ్వాన్‌ మరో షాకిచ్చాడు. ఆదర్శ్‌ను ఔట్‌ చేయడంతో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉదయ్ కూడా పెవిలియన్‌ చేరాడు. లోయరార్డర్‌లో ప్రియాన్షు మోలియా(23), తెలంగాణ వికెట్‌ కీపర్‌ అరవెల్లి అవినాష్‌ రావు (23; 17బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌), సచిన్‌ దాస్‌(26 నాటౌట్‌)లు మెరుపులు మెరిపించారు. బంగ్లా బౌలర్లు మారూఫ్‌కు ఐదు, చౌదరి, మహఫుజుర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో భాగంగా బంగ్లా జట్టులో ఆరిఫుల్‌(41)కి తోడు మహమ్మద్‌(54) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత బంగ్లా బ్యాటర్లు పెవీలియన్‌కు క్యూ కట్టారు. గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ 49.2ఓవర్లలో 174పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ జట్టు 26.2ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 178పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మెక్‌ కిన్నెకు లభించింది. గ్రూప్‌-డిలో పాకిస్తాన్‌ జట్టు 181పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తుచేసింది. పాక్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 284పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్‌ 26.2ఓవర్లలో 103పరుగులకే కుప్పకూలింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షహజాద్‌ ఖాన్‌కు దక్కింది.

స్కోర్‌బోర్డు..

ఇండియా(అండర్‌19) ఇన్నింగ్స్‌: ఆదర్ష్‌ సింగ్‌ (సి)రోహనత్‌ (బి)చౌదరి 76, కులకర్ణి (సి)రహీమ్‌ (బి)మారూఫ్‌ 7, ముషీర్‌ ఖాన్‌ (సి)రహమాన్‌ (బి)మారూఫ్‌ 3, ఉదరు సహరన్‌ (సి)రోహనత్‌ 64, ప్రియాన్షు (సి)అమిన్‌ (బి)మారూఫ్‌ 23, అవనీశ్‌ (సి)మహమ్మద్‌ (బి)మారూఫ్‌ 23, సచిన్‌ దాస్‌ (నాటౌట్‌) 26, మురుగన్‌ అభిషేక్‌ (సి)చౌదరి (బి)మారూఫ్‌ 4, రాజ్‌ లింబని (నాటౌట్‌) 2, అదనం 23. (50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 251పరుగులు.

వికెట్ల పతనం: 1/17, 2/31, 3/147, 4/169, 5/202, 6/226, 7/245

బౌలింగ్‌: ఇక్భాల్‌ హొసైన్‌ 7-0-34-1, మారూఫ్‌ 8-1-43-5, చౌదరి 5-0-23-1, రోహనత్‌ 6-0-40-0, షేక్‌ పవేజ్‌ 10-0-39-0, రహమాన్‌ 10-1-41-1, ఆరిఫుల్‌ 4-0-21-0

బంగ్లాదేశ్‌(అండర్‌19) ఇన్నింగ్స్‌: అషిఖిర్‌ (బి)సౌమీ పాండే 14, జిషన్‌ అలామ్‌ (సి)మురుగన్‌ అభిషేక్‌ (బి)రాజ్‌ లిబని 14, చౌదరి (బి)సౌమీ పాండే 0, ఆరిఫుల్‌ ఇస్లామ్‌ (సి)అవనీశ్‌ (బి)ముషీర్‌ ఖాన్‌ 41, అహరార్‌ అమిన్‌ (ఎల్‌బి)కులకర్ణి 5, మహమ్మద్‌ (ఎల్‌బి)ముషీర్‌ ఖాన్‌ 54, ముఫుజుర్‌ (సి)ఉదయ్ (బి)ప్రియాన్షు 4, షేక్‌ జిబోన్‌ (నాటౌట్‌) 15, రోహనత్‌ (రనౌట్‌)ముషీర్‌ ఖాన్‌ 0, ఎండి ఇక్బాల్‌ (ఎల్‌బి)సౌమీ పాండే, మరుల్‌ మ్రిదా (బి)సౌమీ పాండే 1. అదనం 19.

వికెట్ల పతనం: 1/38, 2/39, 3/41, 4/50, 5/127, 6/142, 7/157, 8/157, 9/162, 10/167

బౌలింగ్‌: రాజ్‌ లింబని 8-0-25-1, నమన్‌ తివారి 5-0-31-0, సౌమీ పాండే 9.5-1-24-4, అర్షిన్‌ కులకర్ణి 5-0-19-1, ముషీర్‌ ఖాన్‌ 10-1-35-2, మురుగన్‌ అభిషేక్‌ 6-0-24-0, ప్రియాన్షు మోలియా 2-0-7-1.

➡️