భారత్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లాండ్‌ టీమ్‌ ఇదే..!

Feb 22,2024 18:00 #Cricket, #England cricket team, #Sports

రాంచీ : రాంచీ వేదికగా శుక్రవారం నుంచి భారత్‌ – ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ సమం చేయాలనే లక్ష్యంతో ఇంగ్లాండ్‌ తుది జట్టును ప్రకటించింది. రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. పేసర్‌ మార్క్‌వుడ్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌ బోర్డు ఓలీ రాబిన్‌సన్‌ను జట్టులోకి తీసుకుంది. మూడో టెస్టులో బెంచ్‌కే పరిమితమైన షోయబ్‌ బషీర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్టు : జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌ స్టో, బెన్‌ ఫోక్స్‌ (వికెట్‌ కీపర్‌), టామ్‌ హార్ట్‌లీ, ఓలీ రాబిన్‌సన్‌, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ అండర్సన్‌

➡️