చివరి మ్యాచ్‌లే కీలకం

May 14,2024 08:04 #Sports

ప్లాేఆఫ్‌కు కోల్‌కతా..
పంజాబ్‌, ముంబయి ఔట్‌..
ఐపిఎల్‌ సీజన్‌-17
ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 రసవత్తరంగా మారింది. ఈ టోర్నీలో ప్రతి జట్టుకు చివరి మ్యాచ్‌లు కీలకంగా మారాయి. 2సార్లు టైటిల్‌ విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లాేబెర్త్‌ను ఖాయం చేసుకోగా.. పంజాబ్‌, ముంబయి జట్లు చవరి మ్యాచ్‌లతో సంబంధం లేకుండా ఎలిమినేట్‌ అయ్యాయి. రాజస్తాన్‌(16పాయింట్లు), చెన్నై(14), సన్‌రైజర్స్‌(14) టాప్‌ా4లో ఉన్నా.. ప్లాేబెర్త్‌లను ఖాయం చేసుకోలేకపోయాయి. ఇక బెంగళూరు(12), ఢిల్లీ(12), లక్నో(12) ఆ తర్వాతి స్థానాలో ఉన్నా.. లక్నోకు ప్లాేఆఫ్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టు బెంగళూరు, ఢిల్లీ జట్లకు 13మ్యాచ్‌లు పూర్తవ్వగా.. లక్నో జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇక రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌క కూడా రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. చెన్నై జట్టు చివరి మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లాేబెర్త్‌ను ఖాయం చేసుకోనుంది. ఈ క్రమంలో చివరి మ్యాచ్‌లు ప్రతి జట్టుకూ కీలకంగా మారాయి.
ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ జట్టు దాదాపు ప్లేఆఫ్స్‌ చేరినట్టే. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో(పంజాబ్‌, కోల్‌కతాతో) ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు సునాయాసంగా చేరుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో కాకుండా తక్కువ తేడాతో ఓడాలి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌, పంజాబ్‌)పై విజయం సాధిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఉండటంతో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా హైదరాబాద్‌ నాకౌట్‌ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌, హైదరాబాద్‌ కచ్చితంగా ప్లే-ఆఫ్స్‌కు చేరడం ఖాయం.
బెంగళూరు, ఢిల్లీ, లక్నోలకు కీలకం..
ఢిల్లీ, బెంగళూరు జట్లు 13మ్యాచులు పూర్తయ్యేసరికి 12పాయింట్లతో 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఢిల్టీ జట్టు చివరి మ్యాచ్‌ను లక్నోతో, బెంగళూరు జట్టు తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను చెన్నైతో ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లు చివరి మ్యాచుల్లో భారీ అంతరంతో మ్యాచ్‌లను ముగిస్తేనే ప్లాేఆఫ్స్‌ ఛాన్స్‌ దక్కనుంది. ఇక లక్నో జట్టు 12మ్యాచ్‌లు ముగిసే 12పాయింట్లతో 7వ స్థానంలో ఉండగా.. ఆ జట్టు చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌లను ఢిల్లీ, ముంబయితో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే దాని ఖాతాలోనూ 16పాయింట్లు జమ అవుతాయి. దీంతో ఆ జట్టు కూడా ప్లాేఆఫ్స్‌కు చేరడానికి మంచి అవకాశం ఉంది. కానీ, నెట్‌ రన్‌రేట్‌ ప్రతికూల అంశంగా మారింది. -0.769 నెట్‌ రన్‌రేట్‌ ఉన్న లక్నో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో నెగ్గితేనే నాకౌట్‌ దశకు చేరడానికి ఛాన్స్‌ ఉంటుంది.
బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే..
బెంగళూరు ప్లా-ఆఫ్స్‌కు చేరాలంటే సన్‌రైజర్స్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడాలి. దాంతోపాటు లక్నో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లోనే విజయం సాధించాలి. వీటితోపాటు ముఖ్యంగా మే 18న చెన్నైతో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు తప్పక విజయం సాధించాలి. బెంగళూరు చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నైపై 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలవాలి లేదా చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది.
చెన్నై గెలిస్తేనే..
చెన్నై జట్టు తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిస్తే సమీకరణాలతో నిమిత్తం లేకుండా నేరుగా ప్లాేఆఫ్స్‌కు చేరుతుంది. బెంగళూరుపై భారీ తేడాతో కాకుండా స్వల్ప తేడాతో ఓడి నెట్‌ రన్‌రేట్‌ పడిపోకుండా చూసుకోవాలి. దీంతోపాటు సన్‌రైజర్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓడిపోయి 14 పాయింట్లతో ఉండాలి. అంతేకాదు మే 14న లక్నోను ఢిల్లీ ఓడించాలి. శుక్రవారం ముంబయి చేతిలో లక్నో ఓడాలి లేదా స్వల్ప తేడాతో నెగ్గాలి. ఈ క్రమంలో ప్లాేఆఫ్స్‌కు చేరాలంటే ప్రతిజట్టుకు చివరి లీగ్‌ మ్యాచ్‌లు కీలకంగా మారాయి.
ఇక ముంబయి, పంజాబ్‌ జట్లు 8పాయింట్లతో 9, 10 స్థానాలో ఉన్నాయి. ముంబయి జట్టు 17న లక్నోతో, పంజాబ్‌ జట్టు 15న రాజస్థాన్‌తో, 19న సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఎలిమినేట్‌ అయిన ముంబయి, పంజాబ్‌ జట్లు చివరి లీగ్‌ మ్యాచుల్లో గెలిచినా, ఓడినా ముందుకెళ్లవు.
– స్పోర్ట్స్‌ డెస్క్‌

➡️